Telugu Global
Telangana

గుండెల్లో ద్వేషం... ఇంటి మీద జాతీయ జెండా -కేటీఆర్ ట్వీట్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రతి రోజూ అనేక ట్వీట్ల ద్వారా దేశంలోని పరిస్థితులపై కామెంట్లు చేస్తూ ఉంటారు.

గుండెల్లో ద్వేషం... ఇంటి మీద జాతీయ జెండా -కేటీఆర్ ట్వీట్
X

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రతి రోజూ అనేక ట్వీట్ల ద్వారా దేశంలోని పరిస్థితులపై కామెంట్లు చేస్తూ ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల సమాచారాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఆయన, మతం పేరుతో దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న, అరాచకాలు చేస్తున్న, అసత్యపు ప్రచారాలతో ప్ర‌జలను పక్కతోవపట్టిస్తున్న బీజేపీ వైష‌మ్యపు రాజకీయాలను చీల్చి చెండాడుతూ ఉంటారు.

ఇవ్వాళ్ళ కేటీఆర్ చేసిన ట్వీట్ ఆలోచనాత్మకంగా ఉంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా' (ప్రతి ఇంటిపై మూడురంగుల జెండా) అని ప్రధాని మోడి ఇచ్చిన పిలుపుపై ఓ ఆంగ్ల పత్రికలో ప్రసాద్ అనే పాఠకుడు రాసిన లేఖను షేర్ చేశారు కేటీఆర్. అందులో ప్రసాద్ ...''ప్రతి ఇంటిపై మూడు రంగుల జెండా నినాదం కన్నా ప్రతి గుండెలో మూడు రంగుల జెండా అనే నినాదం సరి అయినది. గుండె నిండా ద్వేష‍ నింపుకొని ఇంటి మీద జాతీయ ఎగరవేస్తే ఈ దేశానికి ఏం ఉపయోగం'' అని రాశారు. ఆ పేపర్ కటింగ్ ను షేర్ చేసిన కేటీఆర్...

''వార్తా పత్రికలలో రోజువారీ వార్తలు ఎలా కవర్ చేయబడుతున్నాయి అనే విషయాలపై నాకు వ్యక్తిగతంగా వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ, సంపాదకులకు రాసే లేఖలలో పాఠకుల‌ అభిప్రాయాలు మాత్రం నాకు చాలా నచ్చుతాయి. అవి చాలా సూటిగా, పదునుగా ఉంటాయి. '' అని కామెంట్ చేశారు.

''హృదయంలో ద్వేషంతో ఇంటిమీద మూడుర‍ంగుల జెండా ఎగురవేస్తే దేశానికి ఏం ఉపయోగం'' అని ప్రసాద్ రాసిన లేఖలోని వాక్యాలు ఉదహరించారు.



First Published:  9 Aug 2022 6:54 AM GMT
Next Story