Telugu Global
Telangana

తెలంగాణలో 3 రోజులు వైన్స్, బార్లు బంద్‌

నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్‌ 30న పోలింగ్‌ ముగిసే వరకు వైన్‌ షాపులు, బార్లు మూసి ఉండనున్నాయి. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉండటంతో ఆ రోజు కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు.

తెలంగాణలో 3 రోజులు వైన్స్, బార్లు బంద్‌
X

తెలంగాణలో 3 రోజులు వైన్స్, బార్లు బంద్‌

తెలంగాణలో మూడు రోజులు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 28 నుంచి 30 వరకు వైన్‌ షాపులు, బార్లు మూసివేయనున్నారు. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్‌ 30న పోలింగ్‌ ముగిసే వరకు వైన్‌ షాపులు, బార్లు మూసి ఉండనున్నాయి. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉండటంతో ఆ రోజు కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు లైసెన్స్‌దారులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలిచ్చింది.

పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించాలని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. మరోవైపు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలైంది. నవంబర్‌ 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన, 15న విత్‌డ్రాకు చివరితేదీగా నిర్ణయించారు.

నవంబర్‌ 30న తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. డిసెంబర్‌ 5 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు అధికారులు.

First Published:  3 Nov 2023 12:17 PM GMT
Next Story