Telugu Global
Telangana

తీగ లాగితే దొరికిపోతాం అని భయపడుతున్నదెవరు?

పేపర్ లీక్ అయిన పరీక్షలు రాష్ట్రస్థాయి పరీక్షలు... నిందితులు కూడా ఇక్కడివాళ్ళే. చాలా విషయాలు తెలుసుకోవాల్సింది, తేలాల్సింది ఇక్కడే. మరి కేసును సీబీఐకి బదిలీ చేయాలని A2 భార్య ఎందుకు కోరుతుంది?

తీగ లాగితే దొరికిపోతాం అని భయపడుతున్నదెవరు?
X

ఈ తీగేంటి? డొంకలో ఉన్నదెవరు? ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదా? అయితే లేటెస్ట్ వార్త చదవండి.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు సీబీఐతో విచారణ జరిపించాలంటూ ఏ2 నిందితుడిగా ఉన్న అట్ల రాజశేఖర్ రెడ్డి భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్ వేశారు.

పేపర్ లీక్ అయ్యింది తెలంగాణలో. లీక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యింది. సిట్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్ లో ముఖ్య పాత్రధారులను అరెస్ట్ చేసింది. వీళ్ళు పేపర్ లను ఎవరెవరితో షేర్ చేశారు... వీళ్లకు ఎవరు సహాయం చేశారు అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది.

విచారణ మొదలై ఒక వారం కూడా గడవకముందే కేసును సీబీఐకి బదిలీ చేయాలని ప్రధాన నిందితుడు (A2) భార్య హైకోర్టు లో పిటిషన్ వేయడం భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలను గుర్తుచేస్తుంది.

పేపర్ లీక్ అయిన పరీక్షలు రాష్ట్రస్థాయి పరీక్షలు... నిందితులు కూడా ఇక్కడివాళ్ళే. చాలా విషయాలు తెలుసుకోవాల్సింది, తేలాల్సింది ఇక్కడే. మరి కేసును సీబీఐకి బదిలీ చేయాలని A2 భార్య ఎందుకు కోరుతుంది?

అయితే గియితే "నా భర్త నిరపరాధి అన్నెం పున్నెం తెలియనివాడు" అనైనా చెప్పాలి... కానీ విచారణ చేసే వాళ్ళను మార్చండి అని ఆమె హైకోర్టు లో పిటిషన్ ఎందుకు వేసింది? ఆమె వెనుక ఎవరున్నారు?

ఈ మధ్యే జరిగిన ఫార్మ్ హౌజ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసును సీబిఐకి బదిలీ చేయాలన్న డిమాండ్ వెనుక ప్రధాన కారణం కేసులో ఇన్వాల్వ్ అయిన చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడమే (అట).

మరి ఈ పేపర్ లీక్ కేసులో కూడా బయటి రాష్ట్రాల వారి ప్రమేయం ఉందా?

తొమ్మిది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా... ఎగ్జామ్ పేపర్ లీక్ చేయించి, లక్షలాది నిరుద్యోగులను మనోవేదనకు గురిచేసిన ఈ కుట్రలో రాజకీయ కోణం ఉందా? దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయా అన్న బలమైన సందేహాలు లేవనెత్తుతుంది ఈ హైకోర్టు పిటిషన్.

First Published:  20 March 2023 1:07 PM GMT
Next Story