Telugu Global
Telangana

తెలంగాణలో MRNA వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు చేయనున్న WHO... CNBC-TV18 ఇంటర్వ్యూలో KTR వెల్లడి

హైదరాబాద్ ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని చెప్పిన కేటీఆర్ 40 శాతం ఫార్మ‌సీ ఉత్ప‌త్తులు తెలంగాణలోనే జ‌రుగుతున్నాయని, మూడో వంతు వ్యాక్సిన్ లు తెలంగాణలోనే తయారవుతున్నాయని చెప్పారు.

తెలంగాణలో MRNA వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు చేయనున్న WHO... CNBC-TV18 ఇంటర్వ్యూలో KTR వెల్లడి
X

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన తెలంగాణ మంత్రి కేటీఆర్ తో CNBC-TV18 ఎడిట‌ర్ ష‌రీన్ భాన్ ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) MRNA వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు చేయనున్నదని వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, దీని వల్ల తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరిగాయని ఆయన తెలిపారు.

హైదరాబాద్ ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని చెప్పిన కేటీఆర్ 40 శాతం ఫార్మ‌సీ ఉత్ప‌త్తులు తెలంగాణలోనే జ‌రుగుతున్నాయని, మూడో వంతు వ్యాక్సిన్ లు తెలంగాణలోనే తయారవుతున్నాయని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు అమెరికా వంటి దేశాల్లో కూడా అవసరమైన వెంటి లేటర్లు కూడా కరువయ్యాయన్నారు. అందువల్లే లైఫ్ సైన్సెస్ తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామనై కేటీఆర్ తెలిపారు.

కరోనాతో సహాప్రతి మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నామని చెప్పిన కేటీఆర్ అందులో భాగంగానే MRNA వ్యాక్సిన్ల తయారీకోసం WHO ను సంప్రదించామని తెలిపారు. తెలంగాణలో MRNA వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు చేయడానికి WHO కూడా చాలా ఆసక్తిగా ఉందని, త్వరలోనే హబ్ ఏర్పాటు చేస్తారని కేటీఆర్ అన్నారు.

First Published:  19 Jan 2023 7:28 AM GMT
Next Story