Telugu Global
Telangana

మోడీకి రెండు సార్లు అవకాశం ఇచ్చాం, దేశాన్ని నాశనం చేశారు,ఇక చాలు...కేజ్రీవాల్

విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వక్తలందరూ అంటున్నారు. కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నది గవర్నర్లు కాదు వాళ్ళను వెనకనుంచి నడిపిస్తున్న మోడీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

మోడీకి రెండు సార్లు అవకాశం ఇచ్చాం, దేశాన్ని నాశనం చేశారు,ఇక చాలు...కేజ్రీవాల్
X

తానివ్వాళ్ళ రెండు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఒకటి కంటి వెలుగు కాగా మరొకటి సమీకృత కలక్టరేట్లు అని, ఇవి రెండూ చాలా గొప్ప కార్యక్రమాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రోజు ఖమ్మంలో జరిగిన బీఆరెస్ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, కంటి వెలుగు కార్యక్రమం ఢిల్లీ, పంజాబ్ లలో కూడా అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సమీకృత కలెక్టరేట్లను నిర్మించే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ తెలిపారు.

మనకన్నా తర్వాత‌ స్వాతంత్య్రం వచ్చిన దేశాలు కూడా మనకన్నా వేగంగా అభివృద్ది సాధించాయి కానీ ఇంకా మనం వెనకబడే ఉన్నామని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ''మొదటి సారి దేశం గురించి ఆలోచించే అందరం ఒక్క చోటికి వచ్చాం. ఒక్క చోటికి వచ్చిన ముఖ్యమంత్రులందరం రాజకీయాల గురించి కాకుండా మంచి పాలన ఎలా జరగాలని ఆలోచిస్తున్నాం. రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, విద్య గురించి ఆలోచిస్తున్నాం. '' అని కేజ్రీవాల్ అన్నారు.

విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వక్తలందరూ అంటున్నారు. కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నది గవర్నర్లు కాదు వాళ్ళను వెనకనుంచి నడిపిస్తున్న మోడీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

''గవర్నర్లు స్వంతంగా ఏ‍ం చేయగలరు ? వారికి ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది. మోడి చేయమన్నది వాళ్ళు చేస్తారు. 24 గంటలు ఎవరిని ఇబ్బందులు పెట్టాలా అని మోడీ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రధానికి దేశ సమస్య‌లు పట్టవు. ఎప్పుడు ఏ విపక్షాల నాయకుల మీద సీబీఐ దాడులు చేద్దామా? ఐటీ దాడులు , ఈడీ దాడులు చేద్దామా ? ఎక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యేలను కొందామా అని ఆలోచిస్తూ ఉంటాడు.'' అని కేజ్రీవాల్ ద్వజమెత్తారు.

''ఇప్పుడు దేశం మార్పు కోరుతోంది. మనకు 2024 ఒక మంచి అవకాశం. మోడీకి రెండు సార్లు అవకాశం ఇచ్చాం. ఇంకెంత కాలం? మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉంది. రాజకీయాల గురించి కాకుండా ప్రజల సమస్యల‌ గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. '' అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

First Published:  18 Jan 2023 12:48 PM GMT
Next Story