Telugu Global
Telangana

అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం.. రాజాసింగ్ సంచలనం

కాంగ్రెస్‌ స్టీరింగ్ కూడా MIM చేతిలోనే ఉందన్నారు రాజాసింగ్. రేవంత్‌ రెడ్డిని RSS మనిషి అని అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌ విమర్శలు చేశారని గుర్తుచేశారు.

అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం.. రాజాసింగ్ సంచలనం
X

MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. శనివారం నాటి అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరిస్తారని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు రాజాసింగ్‌.

అక్బరుద్దీన్ ఓవైసీ కాసీం రిజ్వీ వారసుడని సంచలన ఆరోపణలు చేశారు రాజాసింగ్. అక్బరుద్దీన్ ముందు తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రమాణం చేయరని చెప్పారు. 15 నిమిషాలు ఇస్తే వంద కోట్ల హిందువులను చంపేస్తానని అక్బరుద్దీన్ అప్పట్లో కామెంట్స్ చేశాడని, దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ముందు ఎలా ప్రమాణం చేయాలని ప్రశ్నించారు రాజాసింగ్‌. సభలో చాలా మంది సీనియర్లు ఉన్న అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్ చేయడం ఎందుకన్నారు.

కాంగ్రెస్‌ స్టీరింగ్ కూడా MIM చేతిలోనే ఉందన్నారు రాజాసింగ్. రేవంత్‌ రెడ్డిని RSS మనిషి అని అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌ విమర్శలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ హయాంలోనూ MIM రాజ్యమే నడుస్తోందని.. అందుకే శనివారం నాటి సమావేశాలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.

First Published:  8 Dec 2023 2:10 PM GMT
Next Story