Telugu Global
Telangana

వైజాగ్ స్టీల్ తో లాభమేంటి..? నేడు కేసీఆర్ చేతికి నినేదిక

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మూలధనం సమకూర్చడం వల్ల కలిగే లాభమేంటి..? దానిపై పెట్టిన పెట్టుబడిని ఎలా తిరిగి రాబట్టుకోవచ్చు.. అనే విషయాలపై వారు నివేదిక తయారు చేశారు. దాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ కి అందిస్తారు.

వైజాగ్ స్టీల్ తో లాభమేంటి..? నేడు కేసీఆర్ చేతికి నినేదిక
X

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకేనంటూ కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు కూడా బిడ్డింగ్ విషయంలో మరో ముందడుగు వేసింది. ఇప్పటికే సింగరేణి సంస్థ వైజాగ్ స్టీల్స్ పై అధ్యయనం మొదలు పెట్టింది. సింగరేణి అధికారులు విశాఖ వెళ్లి రెండురోజులపాటు అక్కడే ఉండి స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేసి వచ్చారు. వారు తమ నివేదికను ఈరోజు సీఎం కేసీఆర్ కి అందిస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మూలధనం సమకూర్చడం వల్ల కలిగే లాభమేంటి..? దానిపై పెట్టిన పెట్టుబడిని ఎలా తిరిగి రాబట్టుకోవచ్చు.. అనే విషయాలపై వారు నివేదిక తయారు చేశారు. దాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ కి అందిస్తారు.

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణలో భాగంగా గతనెల 27న ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ టెండర్లు పిలిచింది. మూలధనం సమకూర్చినా, లేక ముడి సరకు అందించినా.. తిరిగి వారికి స్టీల్ ని అందిస్తామని తెలిపింది. జిందాల్ స్టీల్, టాటా కంపెనీతోపాటు.. తెలంగాణ ప్రభుత్వం కూాడా ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా ఈ డీల్ కుదుర్చుకోవాలనుకుంటోంది. దీనికోసం సింగరేణి అధికారులు విశాఖ వెళ్లి వచ్చారు.

ఆ స్టీల్ ని ఎలా ఉపయోగించుకోవాలి..?

మూలధనానికి బదులుగా.. వైజాగ్ నుంచి స్టీల్ వస్తుంది సరే. మరి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేదే అసలు సమస్య. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా అమలుచేస్తున్న పలు కార్యక్రమాలు, పథకాల పనుల్లో ప్రతి ఏటా దాదాపు 3 లక్షల టన్నుల ఇనుము వినియోగిస్తోంది. దీనిని నేరుగా ‘వైజాగ్‌ స్టీల్‌’ పరిశ్రమ నుంచి టోకుగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని అని సింగరేణి సంస్థ అధ్యయనంలో తేలింది.

వైజాగ్‌ స్టీల్‌ వ్యాపార ఉత్పత్తులకు, సింగరేణి వ్యాపారానికి మధ్య నేరుగా ఎలాంటి సంబంధం లేదు. సింగరేణి గనుల్లో కోకింగ్‌ కోల్‌ లేదు, అంటే.. వైజాగ్‌ స్టీల్‌ కు ముడిసరకును ఇవ్వగల అవకాశం కూడా లేదు. మూలధనం కింద నేరుగా సింగరేణి నిధులు ఇవ్వలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ద్వారా ఈ ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందం వల్ల ఏమేరకు ప్రయోజనం ఉంటుందనే విషయంపై సింగరేణి అధ్యయనం ఈరోజు సీఎం కేసీఆర్ కి చేరుతుంది.

First Published:  15 April 2023 4:12 AM GMT
Next Story