Telugu Global
Telangana

వివేకానంద రెడ్డి హత్య కేసు:ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన 'సుప్రీం'

వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో నిందితుడి బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్ ను కూడా అక్కడికే బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ పోలీసులు సరైన సమయంలో చార్జ్ షీట్ దాఖలు చేయనందున అప్పుడు గంగిరెడ్డిని బెయిల్ వచ్చింది.

వివేకానంద రెడ్డి హత్య కేసు:ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం
X

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన‌ నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.

వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో నిందితుడి బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్ ను కూడా అక్కడికే బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ పోలీసులు సరైన సమయంలో చార్జ్ షీట్ దాఖలు చేయనందున అప్పుడు గంగిరెడ్డిని బెయిల్ వచ్చింది. అయితే సీబీఐ చేతికి కేసు వచ్చాక అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని అందువల్ల అతని బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీం కోర్టును కోరింది.

అయితే గంగిరెడ్డి సీబీఐకి అన్ని విదాలా సహకరిస్తున్నందువల్ల బెయిల్ రద్దు చేయకూడదని గంగిరెడ్డి తరపు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలను విన్న జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం గంగిరెడ్డి బెయిల్ రద్దుద్ది పిటిష‌న్ ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. కేసులోని మెరిట్స్ ను పరిశీలించి, నిందితుడి బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

First Published:  16 Jan 2023 8:10 AM GMT
Next Story