Telugu Global
Telangana

ఆర్భాటం లేకుండా వరుణ్, లావణ్య నిశ్చితార్థం..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితులు అతి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.

ఆర్భాటం లేకుండా వరుణ్, లావణ్య నిశ్చితార్థం..
X

మెగా ఫ్యామిలీ హీరో నిశ్చితార్థం అంటే ఎంత హడావిడి ఉండాలి..? కానీ నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ మాత్రం సింపుల్ గా ఎంగేజ్ మెంట్ జరుపుకున్నారు. సహనటి లావణ్య త్రిపాఠి వేలికి నిశ్చితార్థపు ఉంగరం తొడిగారు. ఆ ఫొటోలను ఆయనే తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.


అతికొద్దిమంది మాత్రమే..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితులు అతి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.మీడియాకి ఎక్కడా ఒక్క ఫొటో కూడా లీక్ కాలేదు. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత హీరో వరుణ్ తేజ్ తనకు తానే ఫొటోలు విడుదల చేశారు. దీంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు, ఇక్కడే ఒక తెలుగబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిలైపోవచ్చు కదా అంటూ గతంలో ఓ సినిమా ఫంక్షన్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి అల్లు అరవింద్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ మాటలు ఇప్పుడు నిజమయ్యాయని, ఆ తెలుగబ్బాయి కూడా మెగా ఫ్యామిలీ కుర్రాడేనంటూ మెసేజ్ లు పెడుతున్నారు అభిమానులు. మొత్తమ్మీద చాన్నాళ్లుగా జనాల్లో నలుగుతున్న వార్తల్ని పుకార్లంటూ మెగా ఫ్యామిలీ కొట్టిపారేస్తూ వచ్చినా చివరకు అవే నిజమయ్యాయి. కొణిదెల ఫ్యామిలీ కోడలిగా మారుతోంది హీరోయిన్ లావణ్య. 2017లో విడుదలైన ‘మిస్టర్‌’ సినిమాలో వరుణ్‌ - లావణ్య తొలిసారి కలసి నటించారు. ఆ తర్వాత ఏడాది ‘అంతరిక్షం’ అనే సినిమా చేశారు. ఆ రెండు సినిమాలతో వీరి ప్రేమ చిగురించింది.

First Published:  9 Jun 2023 11:47 PM GMT
Next Story