Telugu Global
Telangana

భట్టిపై వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు

ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్న తనను పక్కన పెట్టేయడం దారుణమన్నారు వీహెచ్‌. తనకు టికెట్ రాకుండా కుట్రలు చేయడమే కాదు.. ఖమ్మం టికెట్‌ను బయటివారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు.

భట్టిపై వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు
X

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీఎంపీ వీ.హనుమంత రావు. భట్టిని సొంత తమ్ముడిలా అనుకున్నా.. కానీ ఇలా కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన చెందారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత కూడా భట్టికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వీహెచ్‌. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మాట్లాడినందుకే తనపై కక్షగట్టారని ఆవేదన చెందారు.

అందుకే మౌన దీక్ష...

ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్న తనను పక్కన పెట్టేయడం దారుణమన్నారు వీహెచ్‌. తనకు టికెట్ రాకుండా కుట్రలు చేయడమే కాదు.. ఖమ్మం టికెట్‌ను బయటివారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీహెచ్‌. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని అంబర్‌పేట్‌లోని నివాసంలో ఆయన మౌన దీక్షకు దిగారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

వీహెచ్‌కు 2సార్లు భంగపాటు..

అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎమ్మెల్యే టికెట్ ఆశించారు వీహెచ్‌. కానీ ఇవ్వలేదు. దీంతో ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. కానీ ఇప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన మూడు స్థానాల్లో ఖమ్మం కూడా ఉంది. నేడో, రేపో ఈ స్థానాలకు అభ్యర్థును ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం టికెట్‌ పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డికి ఖరారైనట్టు సమాచారం.

First Published:  20 April 2024 8:41 AM GMT
Next Story