Telugu Global
Telangana

కేసీఆర్ లాంటి సీఎం మాకూ కావాలి..

ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ పాలనలో రైతాంగం కష్టాలు అనుభవిస్తోందని అన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన వీరంతా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకూ ఉంటే బాగుండేదని చెప్పారు.

కేసీఆర్ లాంటి సీఎం మాకూ కావాలి..
X

తెలంగాణలో రైతులకు ఎకరానికి 10వేల రూపాయల రైతుబంధు సాయం అందుతోంది. 5లక్షల రూపాయల రైతు బీమాకోసం ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. ఒక రైతుకి ఇంతకంటే ఇంకేం కావాలి. ఈ రైతుబంధుని చూసే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అనే పథకం ప్రారంభించింది. కానీ, సవాలక్ష కండిషన్లు పెట్టింది. అన్ని కండిషన్లూ దాటుకుంటే ఏడాదికి ఇచ్చే సాయం కేవలం 6వేల రూపాయలు మాత్రమే. కేంద్రం రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకుంటున్నారంటూ ప్రశంసించారు ఉత్తర ప్రదేశ్ రైతులు. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ పాలనలో రైతాంగం కష్టాలు అనుభవిస్తోందని అన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన వీరంతా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకూ ఉంటే బాగుండేదని చెప్పారు.

తెలంగాణ రైతాంగం కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలుసుకునేందుకు, వాటి ఫలితాలను ప్రత్యక్షంగా చూసేందుకు 25 రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది రైతులు క్షేత్ర పర్యటనకు వచ్చారు. వారంతా ప్రస్తుతం తెలంగాణలో ప్రాజెక్ట్ ల ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలబడిందని, ప్రత్యక్షంగా ఈ విషయాలను తెలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు రైతులు.

బీజేపీ పాలిత రాష్ట్రాల రైతులు కూడా క్షేత్ర పర్యటనకోసం తెలంగాణకు వచ్చారు. తెలంగాణ అమలుచేస్తున్న రైతు సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి విధానాల అమలుకోసం తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని అన్నారు రైతులు. నష్టాలు లేకుండా తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించడం తమకెంతో ఆశ్చర్యంగా ఉందన్నారు ఇతర రాష్ట్రాల రైతులు. ఇక్కడ సాగునీటి లభ్యత సమృద్ధిగా ఉందని, పెట్టుబడి సాయం అందుతోందని, ఒకవేళ నష్టం వచ్చినా, బీమా సాయం అందుతోందని చెప్పారు. ఇలాంటి పథకాలు అన్ని రాష్ట్రాలలో ఉంటే భారత దేశంలో రైతన్నలు ధీమాగా ఉండగలరని చెప్పారు.

First Published:  26 Aug 2022 2:37 PM GMT
Next Story