Telugu Global
Telangana

బీఆర్ఎస్‌కు మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

2018లో ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు బేతి సుభాష్ రెడ్డి. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సుభాష్‌ రెడ్డికి టికెట్ నిరాకరించిన కేసీఆర్.. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు.

బీఆర్ఎస్‌కు మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
X

లోక్‌స‌భ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు సుభాష్‌రెడ్డి.

తనకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు సుభాష్‌ రెడ్డి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు చెప్పకుండానే బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఖాయం చేశారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అవకాశవాది రాగిడి లక్ష్మారెడ్డికి అవకాశమిచ్చారంటూ తన నిరసనను లేఖలో తెలియజేశారు. ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్‌కు బీజేపీ ఎంపీ టికెట్‌ ఇచ్చిందని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తానంటూ లేఖలో చెప్పుకొచ్చారు సుభాష్ రెడ్డి.

2018లో ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు బేతి సుభాష్ రెడ్డి. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సుభాష్‌ రెడ్డికి టికెట్ నిరాకరించిన కేసీఆర్.. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో బండారు లక్ష్మారెడ్డి విజయం సాధించారు. దీంతో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న సుభాష్ రెడ్డి.. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.

First Published:  18 April 2024 4:57 AM GMT
Next Story