Telugu Global
Telangana

వాళ్లంతా కిరాయి ఆర్టిస్ట్ లు.. కిషన్ రెడ్డి మళ్లీ అబద్ధాలు

కిరాయి ఆర్టిస్ట్ లు అయితే ఆయా స్వామీజీల దగ్గరకు గతంలో బీజేపీ నేతలు ఎందుకు వెళ్లారో చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉంది. నంద కుమార్ అనే ముద్దాయి కిరాయి ఆర్టిస్ అయితే ఆ ఆర్టిస్ట్ కి సంబంధించిన వివిధ హోటళ్లను కిషన్ రెడ్డి ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో వివరించాలి.

వాళ్లంతా కిరాయి ఆర్టిస్ట్ లు.. కిషన్ రెడ్డి మళ్లీ అబద్ధాలు
X

కేసీఆర్ ప్రెస్ మీట్ తో కలుగులో ఎలుకలు బయటకు వస్తాయనే అంచనాలను బీజేపీ నేతలు నిజం చేశారు. వస్తూ వస్తూనే మళ్లీ అబద్ధాల చిట్టా మోసుకొచ్చారు. ఫామ్ హౌస్ లో పట్టుబడిన వారంతా కిరాయి ఆర్టిస్ లంటూ అబద్ధాలు మొదలు పెట్టారు. కిరాయి ఆర్టిస్ట్ లు అయితే ఆయా స్వామీజీల దగ్గరకు గతంలో బీజేపీ నేతలు ఎందుకు వెళ్లారో చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉంది. నంద కుమార్ అనే ముద్దాయి కిరాయి ఆర్టిస్ అయితే ఆ ఆర్టిస్ట్ కి సంబంధించిన వివిధ హోటళ్లను కిషన్ రెడ్డి ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో వివరించాలి. గురివిందల్లాగా ఈ నలుపంతా వెనక పెట్టుకుని వారంతా కిరాయి ఆర్టిస్ట్ లంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.


అసహనం ఎవరిది..?

కేసీఆర్ కుటుంబం అసహనంతో ఉందని అంటున్నారు కిషన్ రెడ్డి. అసహనం ఉండటం వల్లే కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే బీజేపి నేతలు హడావిడిగా తిరిగి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అందులో కిషన్ రెడ్డి మొదటి వారు కావడం విశేషం. నందకుమార్ తో కిషన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయనే విషయం ఇప్పటికే బయటపడింది. కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీడియోలో ఉన్న స్వామీజీల ఆశీర్వాదం కోసం అప్పట్లో కిషన్ రెడ్డి వెళ్లిన ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఫామ్ హౌస్ వీడియోలనన్నీ అన్ని రాష్ట్రాల డీజీపీలకు, కోర్టులకు, ప్రతిపక్ష పార్టీలకు పంపిస్తామని చెప్పడంతో కిషన్ రెడ్డిలో అసహనం మొదలైంది. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన సన్నిహితులనే కిరాయి ఆర్టిస్ట్ లు అనేశారు.


సంబంధం లేదంటే సరిపోతుందా..?

ముగ్గురు నిందితులతో బీజేపీకి సంబంధం లేదంటూ సర్ది చెప్పుకోవాలని చూస్తున్న నేతలు, మరి హడావిడిగా హైకోర్టు మెట్లెందుకు ఎక్కారంటే మాత్రం సమాధానం లేదు. తమకు సంబంధం లేని వారికోసం బీజేపీ నేతలు హైకోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేశారు..? ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని ఎందుకు డిమాండ్ చేశారు..? తీరా ఇప్పుడు 3గంటల ఫుటేజీతో వ్యవహారం మొత్తం బయటపడిన తర్వాత, ఆ వీడియోలన్నీ దేశవ్యాప్తంగా అన్ని పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయి చేతులు కాలాక, మరోసారి ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి.

First Published:  4 Nov 2022 4:14 AM GMT
Next Story