Telugu Global
Telangana

17న తెలంగాణకు అమిత్‌షా, రాహుల్‌.. పోటాపోటీ సభలు..!

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ సైతం అదే రోజు తెలంగాణకు రానున్నారు. రాహుల్‌తో పాటు పార్టీ చీఫ్‌ ఖర్గే, ప్రియాంక సైతం తెలంగాణకు వస్తారని తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ రాహుల్ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ఫైనల్ అయింది.

17న తెలంగాణకు అమిత్‌షా, రాహుల్‌.. పోటాపోటీ సభలు..!
X

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పీక్ స్టేజ్‌కి చేరింది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేసిన బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇక జాతీయ పార్టీలు సైతం స్టార్‌ క్యాంపెయినర్లను బరిలోకి దించుతున్నాయి.

ఇందులో భాగంగా ఈ నెల 17న కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు హైదరాబాద్‌లోని బీజేపీ మీడియా సెంటర్‌లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అమిత్ షా. తర్వాత ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా గద్వాల్‌, వరంగల్‌, నల్గొండ, రాజేంద్రనగర్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు.

ఇక కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ సైతం అదే రోజు తెలంగాణకు రానున్నారు. రాహుల్‌తో పాటు పార్టీ చీఫ్‌ ఖర్గే, ప్రియాంక సైతం తెలంగాణకు వస్తారని తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ రాహుల్ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ఫైనల్ అయింది. 17న పాలకుర్తి, వరంగల్‌, భువనగిరి బహిరంగ సభల్లో రాహుల్‌ పాల్గొంటారు. మరుసటి రోజున‌ (18న) కూడా తెలంగాణలో రాహుల్ పర్యటన ఉంటుందని సమాచారం. ఈ నెల 17న వరంగల్‌లో ఒకే రోజు అమిత్ షా, రాహుల్ బహిరంగ సభలు ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే 6 గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్‌.. పూర్తి స్థాయి మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో మేనిఫెస్టో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. పదో తరగతి నుంచి పీహెచ్‌డీలు చేసే విద్యార్థినులకు మెట్రో ప్రయాణాన్ని ఉచితంగా అందించాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఏపీ తరహాలో అమ్మ ఒడి స్కీమ్‌పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

వార్డు మెంబర్లకు రూ.1500 గౌరవ వేతనం, హైదరాబాద్ అభివృద్ధికి స్పెషన్ ప్లాన్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. కల్యాణ లక్ష్మి తరహాలోనే ఆడపిల్ల పెళ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని యోచిస్తోంది. విద్యార్థులకు ఫ్రీ వై-ఫై సౌకర్యం లాంటి అంశాలు మేనిఫెస్టోలో ఉండే అవకాశాలున్నాయి.

First Published:  14 Nov 2023 3:34 AM GMT
Next Story