Telugu Global
Telangana

దేశ ప్రజలను విభజించేందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ : సీఎం కేసీఆర్

విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృుతులు కలిగిన దేశంలో తెలంగాణ ఒక భిన్నత్వాన్ని చాటుకున్నది.

దేశ ప్రజలను విభజించేందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ : సీఎం కేసీఆర్
X

దేశంలో ఉన్న ప్రజలను విభజించేలా అనేక రకాలైన బిల్లులను తీసుకొని వస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాజాగా తీసుకొని వచ్చిన యూసీసీ (యూనిఫామ్ సివిల్ కోడ్) మరింత ప్రమాదమైనదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ.. కొత్తగా తీసుకొని వచ్చిన బిల్లు వల్ల మరింతగా ప్రజలను విభజిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృుతులు కలిగిన దేశంలో తెలంగాణ ఒక భిన్నత్వాన్ని చాటుకున్నది. ఇలాంటి వాతావరణంలో, ఒక సమసమాజాన్ని నిర్మించే క్రమంలో.. కేంద్రంలోని ప్రభుత్వం తీసుకున్న యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నాము. ప్రపంచానికి ఏకత్వాన్ని చాటుతూ ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

మతాలకు ప్రాంతాలకు అతీతంగా, దేశ ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడాలని, దేశంలోని గంగ జమునా తహజీబ్‌ను రక్షించేందుకు ముందుకు రావాలని, తమ అభ్యర్థనను అర్థం చేసుకుని, తక్షణమే స్పందిస్తూ.. ఉమ్మడి పౌర స్మృతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినందుకు దేశ ప్రజలందరి తరఫున, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అనుకుంటున్న యూసీసీ బిల్లు చాలా దురుద్దేశంతో కూడుకున్నది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బీజేపీ ప్రభుత్వం. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది.

First Published:  10 July 2023 3:49 PM GMT
Next Story