Telugu Global
Telangana

టూల్ కిట్‌తో ట్వీట్లు.. తెలంగాణ బీజేపీ పాట్లు..

తెలంగాణ బీజేపీకి మాత్రం కార్యకర్తలకు కరువొచ్చింది. సోషల్ మీడియాలో కనీసం ట్వీట్లు వేయడానికి కూడా వారికి మనుషులు లేరు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ టెక్నికల్ సెల్ బయటపెట్టింది.

టూల్ కిట్‌తో ట్వీట్లు.. తెలంగాణ బీజేపీ పాట్లు..
X

నాయకుల సభ అంటే అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, ఇతర ఛానళ్ల యూట్యూబ్ లింక్స్ లో కానీ కామెంట్లు పెడుతుంటారు. తమ అధినాయకుడు చెప్పిన మాటల్ని వైరల్ చేయడానికి ప్రత్యేకంగా ఓ టీమ్ కూడా రెడీగా ఉంటుంది. ఆయన వేసిన పంచ్ డైలాగులకి హ్యాష్ ట్యాగ్ లు జతచేసి వైరల్ చేయడానికి సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు సిద్ధంగా ఉంటారు. అయితే తెలంగాణ బీజేపీకి మాత్రం కార్యకర్తలకు కరువొచ్చింది. సోషల్ మీడియాలో కనీసం ట్వీట్లు వేయడానికి కూడా వారికి మనుషులు లేరు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ టెక్నికల్ సెల్ బయటపెట్టింది. టూల్ కిట్ ఆధారంగా బీజేపీ రెడీ చేసిన కొన్ని కామెంట్స్ ని, హ్యాష్ ట్యాగ్స్ ని ముందే బయటపెట్టింది.

జేపీ నడ్డా మాట్లాడటానికి ముందే బండి సంజయ్ ఆయన ప్రసంగ పాఠాన్నంతా ఇంగ్లిష్ లో టైప్ చేయించి, హ్యాష్ ట్యాగ్స్ తో రెడీ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు లేనివాళ్లు.. మీటింగ్ మొదలు కాకముందే ఇలా టూల్ కిట్ ఆధారంగా సోషల్ మీడియాలో కామెంట్లు, ట్వీట్లు వైరల్ చేస్తారనమాట. అంటే పార్టీకి పెద్దగా పలుకుబడి లేకపోయినా, సోషల్ మీడియాలో ఏదో జరిగిపోతున్నట్టు, నడ్డా ప్రసంగానికి భారీ ప్రతిస్పందన వచ్చినట్టు బిల్డప్ ఇస్తారనమాట. దీనికోసం బండి సంజయ్ టూల్ కిట్ తయారు చేయించారని టీఆర్ఎస్ టెక్ సెల్ ట్రోలింగ్ మొదలు పెట్టింది.

జేపీ నడ్డా ఓరుగల్లు అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ టూల్ కిట్ రెడీ అయిందని తెలుస్తోంది. దీన్నిప్పుడు టీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీకి కనీసం కార్యకర్తలకు కూడా దిక్కులేదని అందుకే ఇలా టూల్ కిట్ రెడీ చేసి ట్వీట్లు పెట్టించబోతున్నారంటూ బండారం మొత్తం బయటపెట్టారు. దీనికి ఇంకా బీజేపీ రియాక్ట్ కాలేదు. మొత్తమ్మీద నడ్డా మీటింగ్ వేదికగా బండి సంజయ్ బ్యాచ్ ని టీఆర్ఎస్ కార్యకర్తలు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

First Published:  27 Aug 2022 11:40 AM GMT
Next Story