Telugu Global
Telangana

సింగరేణి గనులు చూస్తారా? టీఎస్ఆర్టీసీ కొత్త టూర్ ప్యాకేజ్

టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తొలి టూర్ బస్సుకు జెండా ఊపారు.

Singareni Darshan
X

సింగరేణి గనులు చూస్తారా? టీఎస్ఆర్టీసీ కొత్త టూర్ ప్యాకేజ్

టీఎస్ఆర్టీసీ సంస్థను లాభాల బాట పట్టించడానికి అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి దర్శన్ పేరుతో తీసుకొచ్చిన స్కీమ్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో దర్శనం టికెట్ కూడా ముందుగానే బుక్ అయి ఉండటంతో భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటోంది. ఇక ట్విన్ సిటీస్‌లోని చారిత్రాత్మక కట్టడాలను చూపించే ఒక టూర్ ప్యాకేజీని కూడా అమలు చేస్తున్నారు.

ప్రతీ రోజు ఉదయం సికింద్రబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఈ బస్సులు బయలు దేరుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ టూర్ ప్యాకేజీకి ఆదరణ లభిస్తోంది. తాజాగా కోల్ టూరిజం కోసం 'సింగరేణి దర్శన్' పేరుతో ఒక వినూత్నమైన ప్యాకేజీని ప్రారంభించారు.

డిసెంబర్ 27 న తెలంగాణ ఆర్టీసీ కోల్ టూరిజం, సింగరేణి దర్శన్‌ను ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తొలి టూర్ బస్సుకు జెండా ఊపారు. జనవరి 7 తర్వాత ఈ ప్యాకేజీ కింద ప్రతీ శనివారం కోల్ టూర్ నడిపించనున్నట్లు అధికారుల తెలిపారు.

ప్యాకేజీలో భాగంగా సికింద్రబాద్, కరీంనగర్ నుంచి బస్సులు నడుస్తాయి. సింగరేణి అండర్ గ్రౌండ్ వ్యూ, ఓపెన్ కాస్ట్ వ్యూతో పాటు జైపూర్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి, రెస్క్యూ స్టేషన్ల పని తీరును పర్యటకులకు వివరించనున్నారు.

సికింద్రబాబ్ నుంచి వచ్చే ప్రయాణికులు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ కోసం విడిగా డబ్బులు చెల్లించాలి. అయితే లంచ్, స్నాక్స్ మాత్రం సింగరేణి సంస్థ అందిస్తుంది. ఈ టూర్ ప్యాక్ ధర సికింద్రాబాద్ నుంచి రూ.1,850, కరీంనగర్ నుంచి రూ.1,050గా నిర్ణయించారు. డిసెంబర్ 31 లోపు బుక్ చేసుకుంటే టికెట్లపై రూ.250 రాయితీగా ఇస్తున్నారు. సింగరేణి సంస్థ అన్ని భద్రతా చర్యలను తీసుకొని ఈ ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టూర్‌కు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. పిల్లలకు,పెద్దలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంపొందించడానికే ఈ సింగరేణి దర్శన్ టూర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

First Published:  28 Dec 2022 10:36 AM GMT
Next Story