Telugu Global
Telangana

సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆఫర్లు..

TSRTC offers for Sankranti 2023: టీఎస్ఆర్టీసీ వినూత్న ఆఫర్ తో ముందుకొచ్చింది. తిరుగు ప్రయాణానికి కూడా ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే అందులో 10శాతం రాయితీ ఇస్తామంటున్నారు అధికారులు.

TSRTC offers for Sankranti 2023
X

సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆఫర్లు..


పండగల వేళ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెల్స్ సంస్థలు చార్జీల మోత మోగిస్తాయి. ఆర్టీసీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. స్పెషల్ సర్వీసుల పేరుతో చార్జీలు పెంచేందుకు ప్రయత్నిస్తాయి. కానీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం పండగ వేళ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. చార్జీలో 10శాతం రాయితీ ఇస్తానంటోంది. అయితే ఇది కేవలం తిరుగు ప్రయాణానికి మాత్రమే. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ముందుగానే రిటర్న్ జర్నీకి టికెట్ బుక్ చేసుకుంటే అందులో 10శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్, ఎండీ సజ్జనార్.

Advertisement

ఓవైపు కరోనా భయాలు ఉన్నా కూడా ప్రయాణాలపై ఆంక్షలేవీ లేకపోవడంతో ప్రస్తుతానికి పండగకి సొంతూళ్లకు వెళ్లేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సొంత వాహనాలు ఉన్నవారి సంగతి సరేసరి. ప్రజా రవాణా విషయానికొస్తే హైదరాబాద్ నుంచి చాలామంది రైళ్లు, బస్సుల్లో సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఇక అందరూ ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ దశలో టీఎస్ఆర్టీసీ వినూత్న ఆఫర్ తో ముందుకొచ్చింది. తిరుగు ప్రయాణానికి కూడా ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే అందులో 10శాతం రాయితీ ఇస్తామంటున్నారు అధికారులు.

కేవలం పండగ వరకే ఈ ఆఫర్ పరిమితం కాదు. పండగ తర్వాత జనవకి 31 వరకు 10శాతం రాయితీ కొనసాగిస్తామని చెప్పారు అధికారులు. అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ చేసుకునేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జరీ, రాజ‌ధాని, గ‌రుడ ప్లస్ బ‌స్సుల్లో ప్రయాణించేవారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Next Story