Telugu Global
Telangana

TSPSC ఎగ్జామ్ పేపర్స్ హ్యాక్ ... రెండు పరీక్షలు రద్దు చేసిన అధికారులు

రేపు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీయర్ (TPBO) పోస్టులకు పరీక్ష జరగాల్సి ఉంది. అదే విధంగా ఈ నెల 15, 16 తేదీల్లో వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జన్ పరీక్షలు జరగాల్సి ఉండగా ఆ రెండు పరీక్ష పత్రాలు హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు.

TSPSC ఎగ్జామ్ పేపర్స్ హ్యాక్ ... రెండు పరీక్షలు రద్దు చేసిన అధికారులు
X

TSPSC ఎగ్జామ్స్ కు సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ అయ్యింది. దాంతో రెండు పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.

రేపు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీయర్ (TPBO) పోస్టులకు పరీక్ష జరగాల్సి ఉంది. అదే విధంగా ఈ నెల 15, 16 తేదీల్లో వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జన్ పరీక్షలు జరగాల్సి ఉండగా ఆ రెండు పరీక్ష పత్రాలు హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఆ రెండు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు TSPSC అధికారులు ప్రకటించారు.

కంప్యూటర్ హ్యాకింగ్ పై అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాయిదా వేసిన పరీక్షలను మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని TSPSC అధికారులు ప్రకటించారు.

First Published:  11 March 2023 4:15 PM GMT
Next Story