Telugu Global
Telangana

తెలంగాణలో గ్రూప్స్‌ ఎగ్జామ్స్ తేదీలు ఇవే..

ఇటీవల తెలంగాణ గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 19న 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను TSPSC విడుదల చేసింది.

తెలంగాణలో గ్రూప్స్‌ ఎగ్జామ్స్ తేదీలు ఇవే..
X

తెలంగాణలో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌ - 2 పరీక్షలు నిర్వహించాలని TSPSC నిర్ణయించింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌ - 3 పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్‌ - 1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి.

ఎగ్జామ్‌ తేదీలు ఇవే ..

గ్రూప్‌ - 1 మెయిన్స్‌ - అక్టోబర్‌ 21 నుంచి..

గ్రూప్ - 1 ప్రిలిమినరీ - జూన్ 9 నుంచి

గ్రూప్‌ - 2 ఎగ్జామ్ - ఆగస్ట్‌ 7, 8

గ్రూప్‌ - 3 ఎగ్జామ్ - నవంబర్ 17, 18

ఇటీవల తెలంగాణ గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 19న 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది TSPSC. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది.

ఇక గత ప్రభుత్వం గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 3 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. 783 గ్రూప్‌ - 2 పోస్టుల కోసం 5 లక్షల 51 వేల 943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 1388 పోస్టుల కోసం గ్రూప్‌ - 3 నోటిఫికేషన్ 2022 డిసెంబర్‌ 30న విడుదల కాగా... 5 లక్షల 36 వేల మంది అప్లై చేసుకున్నారు.

First Published:  6 March 2024 12:25 PM GMT
Next Story