Telugu Global
Telangana

మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. రూ.80 తో సిటీ అంతా తిరగొచ్చు

సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెంచే ఉద్దేశంతో T24 టికెట్ ను తీసుకొచ్చారు. దీని ధరను రూ.100 ఉండేది.. కానీ ఇటీవలే రూ. 10 తగ్గించి రూ.90 చేశారు. T 24 టికెట్ తో పాటు T6 టికెట్ కూడా తీసుకొచ్చారు.

మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. రూ.80 తో సిటీ అంతా తిరగొచ్చు
X

టీఎస్ఆర్టీసీ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు T24 టికెట్ రేట్లలో డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణించే మహిళలకు T24 టికెట్‌ను కేవలం రూ.80కే అందిస్తుంది.

సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్‌ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90, సీనియర్‌ సిటిజన్లకు రూ.80లకు విక్రయిస్తుండగా.. తాజాగా మహిళలకు కూడా రూ.10 తగ్గించి రూ.80కే ఇస్తుంది.

ఈ కొత్త T24 టికెట్‌ ధర ఈ నెల 9 వ తేది నుంచే తేదీ అమలులోకి రానుంది. హైదరాబాద్ లో నడిచే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు కొనుక్కొని 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చు.

సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెంచే ఉద్దేశంతో T24 టికెట్ ను తీసుకొచ్చారు. దీని ధరను రూ.100 ఉండేది.. కానీ ఇటీవలే రూ. 10 తగ్గించి రూ.90 చేశారు. T 24 టికెట్ తో పాటు T6 టికెట్ కూడా తీసుకొచ్చారు.

ఈ టికెట్ రూ. 50 కొనుగోలు చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణం చేయవచ్చు. రూ. 300 చెల్లించి ఎఫ్-24 టికెట్ కొనుగోలు చేస్తే.. ఆ టికెట్‌పై న‌లుగురు వ్య‌క్తులు రోజంతా ప్ర‌యాణించే వెసులుబాటు క‌ల్పించారు.

First Published:  9 May 2023 1:19 AM GMT
Next Story