Telugu Global
Telangana

టీఆర్‌ఎస్ సొంత విమానం

కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేసిన తర్వాత దసరా రోజు విమానం కోసం ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విమానం కొనుగోలుకు అవసరమైన నిధులను విరాళాల రూపంలో సేకరించాలని నిర్ణయించారు.

టీఆర్‌ఎస్ సొంత విమానం
X

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేక విమానాన్ని టీఆర్ఎస్ సిద్ధం చేసుకుంటోంది. కేసీఆర్ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టర్డ్ ఫైట్‌ను కొనుగోలు చేయాలని ఆపార్టీ నిర్ణయించింది. 12 సీట్ల కెపాసిటీతో 80 కోట్ల రూపాయల ఖర్చుతో విమానం కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేసిన తర్వాత దసరా రోజు విమానం కోసం ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విమానం కొనుగోలుకు అవసరమైన నిధులను విరాళాల రూపంలో సేకరించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పటికే చాలా మంది దాతలు తమ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.

ఇప్పటి వరకు కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనల సమయంలో విమానం అద్దెకు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడికైనా తక్షణం వెళ్లేందుకు వీలుగా సొంత విమానం ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీకి సొంత విమానం లేదు. కొనుగోలు చేస్తే ఆ రికార్డు టీఆర్‌ఎస్ పేరునే ఉంటుంది.

First Published:  30 Sep 2022 3:41 AM GMT
Next Story