Telugu Global
Telangana

బీజేపీ కొడకల్లారా? ఇకపై చూసుకుందాం..

మునుగోడు ఎన్నిక వేళ ఈటల అత్తగారి ఊరిలో గొడవ సృష్టించి ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రెడ్డిని హత్య చేయించే ప్రయత్నం చేశారన్నారు. ఇలా హత్యారాజకీయాలకు ఈటల పెట్టింది పేరని ఆరోపించారు.

బీజేపీ కొడకల్లారా? ఇకపై చూసుకుందాం..
X

ఈటల రాజేందర్‌, బీజేపీ నేతలపై టీఆర్ఎస్‌ నేత కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇంతకాలం ఓర్పుతో వ్యవహరించామని ఇకపై బీజేపీ నేతలను ఉరికిస్తామన్నారు. బీజేపీ నేతలకు తాట తీస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ కొడకల్లారా?.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు ఉరికిస్తాం అని హెచ్చరించారు.

బ్యాన్ చేసిన కారును పోలిన గుర్తులను తీసుకొచ్చి టీఆర్‌ఎస్‌ ఓట్లను చీల్చినా టీఆర్‌ఎస్ విజయం సాధించిందన్నారు. మునుగోడు ఎన్నిక తర్వాత ఈటల రాజేందర్ మాటలు వింటుంటే నవ్వొస్తోందన్నారు. ఈటల ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. కేంద్రం నుంచి మోడీ, అమిత్ షా వందల కోట్ల రూపాయలు పంపిస్తే ఆ డబ్బుందన్న మదంతో టీఆర్‌ఎస్‌ను ఓడించాలనుకున్నారని.. కానీ ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పారన్నారు. కేసీఆర్‌ దెబ్బకు నేడు ఢిల్లీలో బీజేపీ నేతలు అబ్బా అంటున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

మునుగోడులో పంచేందుకు ఆ వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారో ఈటల రాజేందర్‌ సమాధానం చెప్పాలన్నారు. ఈటల వ్యక్తిగత సహాయకుడు కోటి రూపాయల నగదుతో దొరికిపోయింది వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గొడవలు పెట్టి హత్యారాజకీయాలను ప్రోత్సహించిన వ్యక్తి ఈటల అని ఆరోపించారు. 2014 జనవరి 5న టీఆర్ఎస్‌ మాజీ ఎంపీటీసీని హత్య చేయించింది నిజం కాదా.. అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ కుమార్ యాదవ్‌ను టార్చర్‌ పెడితే అవమానంతో గుండెపోటు వచ్చి చనిపోయింది నిజం కాదా.. అని ప్ర‌శ్నించారు. 2018లో ఈటల మీద పోటీ చేసినప్పుడు తననూ హత్య చేయించే ప్రయత్నం చేయడం నిజమో.. కాదో చెప్పాలన్నారు.

Advertisement

మునుగోడు ఎన్నిక వేళ ఈటల అత్తగారి ఊరిలో గొడవ సృష్టించి ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రెడ్డిని హత్య చేయించే ప్రయత్నం చేశారన్నారు. ఇలా హత్యారాజకీయాలకు ఈటల పెట్టింది పేరని ఆరోపించారు. దమ్ముంటే ఈటల రాజేందర్ ఇప్పుడు రాజీనామా చేసి హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు రావాలని సవాల్ చేశారు. 75 కోట్ల రూపాయలను రాజగోపాల్ రెడ్డి కంపెనీకి బదిలీ చేశారని, మరో 25 కోట్లను జమునా హచరీస్ కు మళ్లించారని.. ఇది జరగలేదని ఈటల రాజేందర్ చెప్పగలరా అని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు.

Next Story