Telugu Global
Telangana

గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అరెస్ట్

రేవంత్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తదితర నేతలు ఉన్నారు.

గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అరెస్ట్
X

హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామ‌ని రేవంత్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం సీఎల్పీ కార్యాలయం నుంచి నేరుగా రేవంత్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తదితర నేతలు ఉన్నారు.

అయితే రేవంత్ రెడ్డిని అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సోమవారం గన్ పార్క్ లో నిరసన తెలిపేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.

ఈ విషయమై పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లను అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు.

First Published:  17 Oct 2023 8:51 AM GMT
Next Story