Telugu Global
Telangana

రియల్ ఎస్టేట్ నా పేటెంట్‌- రేవంత్ రెడ్డి

రామ్‌ జెఠ్మలాని అంటే న్యాయ కోవిదుడని చెప్తారని.. అలాగే తన అనే పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది రియల్‌ ఎస్టేట్ అన్నారు రేవంత్ రెడ్డి. రియల్‌ ఎస్టేట్‌ అనేది తనకు పేటెంట్‌ అన్నారు.

రియల్ ఎస్టేట్ నా పేటెంట్‌- రేవంత్ రెడ్డి
X

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ పేరు చెప్పగానే ప్రత్యర్థులు చేసే విమ‌ర్శ‌ రియల్‌ ఎస్టేట్ బ్రోకర్ అని. రేవంత్ రెడ్డిపై గతంలోనూ భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. రేవంత్‌ ఆర్టీఐని దుర్వినియోగం చేసి అనేక భూకబ్జాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. కొడంగల్‌లో ఇటీవల జరిగిన ప్రజా ఆశీర్వాద సభలోనూ సీఎం కేసీఆర్‌ రేవంత్ రెడ్డిని పెద్ద భూకబ్జాదారుడ‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలోనే అనేక కబ్జాలు పెట్టారన్నారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుతో జరిగిన ఓ చర్చ కార్యక్రమంలో ఈ విమర్శలపై స్పందించారు రేవంత్ రెడ్డి.

నాగేశ్వర రావు అంటే ప్రొఫెసర్ గుర్తొస్తారని.. రామ్‌ జెఠ్మలాని అంటే న్యాయ కోవిదుడని చెప్తారని.. అలాగే తన అనే పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది రియల్‌ ఎస్టేట్ అన్నారు రేవంత్ రెడ్డి. రియల్‌ ఎస్టేట్‌ అనేది తనకు పేటెంట్‌ అన్నారు. రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నానంటే దానికి రియల్ ఎస్టేటే కారణమన్నారు.


ఇటీవల జరిగిన ఇండియా టుడే సదస్సులో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రాచకొండలో 50 వేల ఎకరాల్లో కొత్త సిటీ నిర్మిస్తామంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ నేతలు భూములపై కన్నేశారన్న విమర్శలు వచ్చాయి.

First Published:  26 Nov 2023 8:17 AM GMT
Next Story