Telugu Global
Telangana

కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కొత్త పెళ్లికొడుకు..

వివాహం జైపూర్ లో జరగగా రిసెప్షన్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు శర్వానంద్ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా శర్వానంద్ స్వయంగా సీఎం కేసీఆర్ ని కలసి రిసెప్షన్ కి రావాలని కోరారు.

కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కొత్త పెళ్లికొడుకు..
X

కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కొత్త పెళ్లికొడుకు..

తెలుగు సినిమా హీరో, కొత్త పెళ్లికొడుకు శర్వానంద్, సీఎం కేసీఆర్ ని కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. తన వివాహ రిసెప్షన్ కి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శర్వానంద్ కి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పెళ్లికొడుకుతో కాసేపు ముచ్చటించారు.


గత శనివారం రాత్రి హీరో శర్వానంద్, రక్షితారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపూర్‌ లోని లీలా ప్యాలెస్‌ లో వీరి పెళ్లి వేడుక నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షపలు తెలిపారు. శర్వానంద్‌ సతీమణి రక్షిత సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్‌ రెడ్డి. తల్లి సుధారెడ్డి.

వివాహం జైపూర్ లో జరగగా రిసెప్షన్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు శర్వానంద్ కుటుంబ సభ్యులు. శుక్రవారం సాయంత్రం రిసెప్షన్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శర్వానంద్ స్వయంగా సీఎం కేసీఆర్ ని కలసి రిసెప్షన్ కి రావాలని కోరారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ని కలసి ఆహ్వానించారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.

First Published:  8 Jun 2023 1:08 PM GMT
Next Story