Telugu Global
Telangana

టీడీపీకి షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన సినీనటి..

పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న కారణంతో టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా సమయంలో తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీలోని నేత‌ల‌పై సంచలన ఆరోపణలు చేశారు.

టీడీపీకి షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన సినీనటి..
X

సినీనటి, టాలీవుడ్‌ వెటరన్ హీరోయిన్‌ దివ్యవాణి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న దివ్యవాణి.. బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ నేతలు దివ్యవాణితో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించగా.. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసి కండువా కప్పుకున్నారని తెలుస్తోంది.

గతంలో దివ్యవాణి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. మహానాడులో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది.. పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న కారణంతో టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా సమయంలో తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీలోని నేత‌ల‌పై సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సమయంలో ఏపీ సీఎం జగన్‌ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు దివ్యవాణి. 2019లో తెలుగుదేశం పార్టీలో చేరి.. రెండేళ్లకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

First Published:  22 Nov 2023 5:12 AM GMT
Next Story