Telugu Global
Telangana

సెక్రటేరియట్ కు టైట్ సెక్యూరిటీ..

మొత్తం 6 సెంట్రీ పోస్టుల్లో నిరంతరం పహారా ఉంటుంది. ప్రస్తుతం 100మంది SPF సిబ్బంది సెక్యూరిటీగా ఉన్నారు. కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత.. 650మంది సిబ్బందికి ఇక్కడ డ్యూటీలు వేస్తారు.

సెక్రటేరియట్ కు టైట్ సెక్యూరిటీ..
X

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఈనెల 30న ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. సెక్రటేరియట్ రూపు రేఖల దగ్గరన్నుంచి, లోపల ఉన్న సౌకర్యాల వరకు ప్రతీదీ ఆసక్తికర విషయమే. అయితే సచివాలయ సెక్యూరిటీ వీటన్నిటిలో మరింత హైలెట్ కాబోతోంది. తెలంగాణ కొత్త సచివాలయానికి భారీ సెక్యూరిటీతో గస్తీ ఏర్పాటు చేస్తున్నారు.

6 సెంట్రీ పోస్ట్ లు, 650 మంది సిబ్బంది..

సచివాలయానికి నాలుగువైపులా ఏర్పాటు చేసిన సెంట్రీ పోస్టుల్లో నిరంతరం సాయుధ సిబ్బంది పహారా కాస్తారు. వీటితో పాటు సచివాలయ ప్రవేశమార్గంలో అదనంగా రెండు సెంట్రీ పోస్టులున్నాయి. మొత్తం 6 సెంట్రీ పోస్టుల్లో నిరంతరం పహారా ఉంటుంది. సీఎం కార్యాలయం, ప్రధాన ప్రవేశద్వారం వంటి కీలక ప్రాంతాల్లో కాపలా సిబ్బందికి అధునాతన ఆయుధాలు సమకూర్చుతున్నారు. నిర్మాణ సమయంలో స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SPF) సచివాలయ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. సచివాలయం ప్రారంభమైన తర్వాత ఆ బాధ్యతలు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP) పరిధిలోకి వెళ్తుంది. ప్రస్తుతం 100మంది SPF సిబ్బంది సచివాలయ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సచివాలయ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత.. 650మంది సిబ్బందికి ఇక్కడ డ్యూటీలు వేస్తారు. ఇందులో TSSP సిబ్బంది 350మంది ఉంటారు. ఏఆర్ పోలీసులు 300మంది ఉంటారు. సచివాలయం ఎంట్రీతోపాటు, లోపల.. వాహనాల రాకపోకల నియంత్రణకోసం 22 మంది ట్రాఫిక్‌ పోలీసులను కేటాయింటారు.

సందర్శకులకు బార్‌ కోడ్‌ పాస్ లు..

సచివాలయానికి వచ్చే సామాన్యులు, సందర్శకులకు ముందస్తు అనుమతి ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. వీరికి బార్ కోడ్ తో కూడిన పాస్ ఇస్తారు. ఆ పాస్ లో వారు ఏ బ్లాక్ కి వెళ్లాలో నిర్ణయిస్తారు. అక్కడికి మినహా మరే ఇతర బ్లాక్ లకు వారికి అనుమతి ఉండదు. ఈ వ్యవహారాలన్నింటినీ హైదరాబాద్‌ నగర పోలీస్‌ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇక సచివాలయంలోని ఆరు అంతస్తుల్లో మెట్ల మార్గం దగ్గర, లిఫ్ట్ ల దగ్గర పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. సచివాలయంలో మొత్తం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో వీటిని పర్యవేక్షిస్తారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు రెండు వాహనాలు, 34 మంది సిబ్బంది నిత్యం సచివాలయం ఆవరణలోనే ఉంటారు.

First Published:  19 April 2023 5:24 AM GMT
Next Story