Telugu Global
Telangana

ఆసిఫాబాద్, వికారాబాద్, మెద‌క్ లలో 'NEET' సెంట‌ర్లు తొల‌గింపు

MBBS, BDS, BAMS, BSMS, BUMS , BHMS కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగే నీట్ పరీక్ష గత సంవత్సరం రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో జరగగా ఈ సారి 21కి తగ్గించారు. దేశవ్యాప్తంగా గత ఏడాది 543 టెస్ట్ సెంటర్లుండగా నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు 485కి తగ్గించింది.

ఆసిఫాబాద్, వికారాబాద్, మెద‌క్ లలో NEET సెంట‌ర్లు తొల‌గింపు
X

ఈ సంవత్సరం తెలంగాణలోని ఆసిఫాబాద్, మెదక్, వికారాబాద్ లలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) UG 2023 సెంటర్లను తొలగించారు.అక్కడి అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి వారికి అనుకూలమైన మరో సెంటర్ ను ఎంచుకోవాలని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. నీట్ టెస్ట్ మే 7న జరగనుంది.

MBBS, BDS, BAMS, BSMS, BUMS , BHMS కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగే నీట్ పరీక్ష గత సంవత్సరం రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో జరగగా ఈ సారి 21కి తగ్గించారు. దేశవ్యాప్తంగా గత ఏడాది 543 టెస్ట్ సెంటర్లుండగా నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు 485కి తగ్గించింది.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు, అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునేటప్పుడు తమకు అనుకూలమైన రెండు సెంటర్లను ఎంచుకోవాలి. అందులో ఒక సెంటర్ ను అభ్యర్థులకు కేటాయిస్తారు.

అయితే అభ్యర్థి ఎంచుకున్న రెండు సెంటర్లు కాకుండా మరో సెంటర్ ను కూడా కేటాయించే హక్కు NTAకి ఉంది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) UG 2023

* https://neet.nta.nic.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి

* దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 6, రాత్రి 9

* ఫీజు లావాదేవీ: ఏప్రిల్ 6, రాత్రి 11.50

* రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్ కేటగిరీ: రూ. 1,700

* రిజిస్ట్రేషన్ ఫీజు: EWS, OBC-NCL: రూ. 1,600

* రిజిస్ట్రేషన్ ఫీజు: SC, ST, PwD, థర్డ్ జెండర్ కేటగిరీలు: రూ. 1,000

First Published:  9 March 2023 9:42 AM GMT
Next Story