Telugu Global
Telangana

కేసీఆర్, రేవంత్‌ను ఢీకొట్టబోతున్న రమణారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

కామారెడ్డి బీజేపీ టిక్కెట్‌ దక్కించుకున్న రమణారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఇప్పుడు డీటైల్డ్‌గా తెలుసుకుందాం. రమణారెడ్డి వైఎస్సార్‌కు వీరాభిమాని. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

కేసీఆర్, రేవంత్‌ను ఢీకొట్టబోతున్న రమణారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
X

కేసీఆర్, రేవంత్‌ను ఢీకొట్టబోతున్న రమణారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

కామారెడ్డి రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో జనం చూపంతా ఆ నియోజ‌క‌వ‌ర్గంపైనే పడింది. అయితే ఇద్దరు అగ్రనాయకులను ఢీ కొట్టేందుకు బీజేపీ కూడా మంచి పేరున్న లీడర్‌నే రంగంలోకి దించబోతోందనే చర్చ జరిగింది. ధర్మపురి అర్వింద్‌ను పోటీ చేయిస్తారనే చర్చ న‌డిచింది. కానీ, బీజేపీ అనూహ్యంగా స్థానిక నేతనే రంగంలోకి దింపి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. సీఎం కేసీఆర్‌ను, రేవంత్‌రెడ్డిని ఢీకొట్టబోతున్న బీజేపీ అభ్యర్థి. ఈయన కేసీఆర్‌ అంత గొప్ప నాయకుడు కాదు. రేవంత్‌లాగా ఎమ్మెల్యే, ఎంపీగా చేసిన అనుభవమూ లేదు. మరి బీజేపీ ధైర్యం ఏంటి..?. రణరంగాన్ని తలపించబోయే కామారెడ్డిలో రమణారెడ్డినే ఎందుకు రంగంలోకి దింపింది?. అసలు కాటిపల్లి వెంకట రమణారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..?. అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా జరుగుతోంది.

కామారెడ్డి బీజేపీ టిక్కెట్‌ దక్కించుకున్న రమణారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఇప్పుడు డీటైల్డ్‌గా తెలుసుకుందాం. రమణారెడ్డి వైఎస్సార్‌కు వీరాభిమాని. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్ సీనియర్‌ నేత షబ్బీర్ అలీ శిష్యుడిగా ఉన్నారు. వైఎస్సార్ చనిపోయాక కాంగ్రెస్ పార్టీని వీడి జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన YSRCPలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్‌లో BRSకు మద్దతు కూడా తెలిపారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న రమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసిన అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్‌ వ్యాపారులతో ఆర్థికపరమైన సంబంధాలు కూడా ఉన్నాయి. తండ్రి పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసిన రమణారెడ్డి.. కామారెడ్డి నియోజకవర్గంలో సొంత ఖర్చులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.

తాతల నుంచి వస్తున్న ఆస్తుల్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు విరాళంగా ఇచ్చారు. బీజేపీతో సంబంధం లేకుండా తను వ్యక్తిగతంగా ఓ మేనిఫెస్టో కూడా ప్రకటించారు రమణారెడ్డి. ఏయే ఊళ్లలో ఏం పనులు చేయించ‌బోతారో మేనిఫెస్టోలో వివరించారు. చూడాలి మరి ఓవైపు కేసీఆర్, మరోవైపు రేవంత్‌రెడ్డి.. వీరిద్దరి ముందు కామారెడ్డిలో రమణారెడ్డి ప్రభావం ఎంత ఉండబోతోందో..?

First Published:  10 Nov 2023 7:34 AM GMT
Next Story