Telugu Global
Telangana

అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం లేదు -KCR

తెలంగాణలో చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటి వెనక ఒక ఫిలాసఫీ ఉన్నది. ఏదోదో పైపైన ఓట్ల కోసం రూపొందించిన కార్యక్రమాలు కావవి. ఎంతో మేధోమథనం చేసి తయారు చేసిన కార్యక్రమాలవి అని కేసీఆర్ అన్నారు.

అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం లేదు -KCR
X

ఏడేళ్ల క్రితం 60వేలకోట్ల రూపాయల బడ్జెట్‌ ఉండే తెలంగాణలో నేడు 2.50లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టే వరకు రాగలిగామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌ సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంచిన ముఖ్యమంత్రి అనంతరం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ....ప్రతిరోజూ కరెంట్ కోతలతో దారుణ‌మైన కరెంటు కష్టాలు అనుభవించిన తెలంగాణ నేడు.. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే నెంబర్‌ వన్ అని చెప్పిన్ అకేసీఆర్, మనకు దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదన్నారు. ''ఇక సంక్షేమ పథకాల్లో తెలంగాణకు సాటిగానీ, పోటిగానీ లేరు. నిబద్ధతతో పని చేసినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అకింతభావంతో పనిచేసినటువంటి ప్రభుత్వ సిబ్బంది వల్లనే ఇదంతా సాధ్యమైంది'' అని కేసీఆర్ అన్నారు.

''తెలంగాణలో చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటి వెనక ఒక ఫిలాసఫీ ఉన్నది. ఏదోదో పైపైన ఓట్ల కోసం రూపొందించిన కార్యక్రమాలు కావవి. ఎంతో మేధోమథనం చేసి తయారు చేసిన కార్యక్రమాలవి'' అని కేసీఆర్ అన్నారు. ''సంస్కరణలు అనేది అన్‌ ఎండింగ్‌ ప్రాసెస్‌. మానవజాతి భూమిపై ఉన్నన్ని రోజులు సంస్కరణలు కొనసాగుతాయి, దానికి అంతం ఉండదు. ఎప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేధోమధనం చేసి కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకువస్తారు.ఏ కార్యక్రమం విజయవంతం చేయాలన్నాఒక ముఖ్యమంత్రో, ఒక మంత్రో, ఎమ్మెల్యేనో, కలెక్టరో అనుకుంటే ఏమీ జరుగదు. అందరు కలిసి టీమ్‌ వర్క్‌ చేసే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం.'' అని కేసీఆర్ పేర్కొన్నారు.

''కంటి వెలుగు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు పేదల జీవితాల్లోని కష్టాలు చూసిన తర్వాత వచ్చినవే, గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామంలో 127 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో 27 మంది పిల్లలు ఉన్నారు. వారికి కంటి జబ్బులున్న విషయం కూడా తెలియదు. అది చూసిన తర్వాతనే నేను కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాను. పేద మహిళ గర్భం ధరించిన తర్వాత కూడా పని చేయాల్సి వస్తుంది. వాళ్ళ పేదరికం అలాంటిది. మహిళ పని చేయకపోవడం ద్వారా ఏదైతే డబ్బు కోల్పోతుందో దాన్ని మనం ఇవ్వాలనే ఆలోచనతో వచ్చిందే కేసీఆర్‌ కిట్ పథకం''. అని కేసీఆర్ తెలిపారు.

First Published:  4 Dec 2022 10:56 AM GMT
Next Story