Telugu Global
Telangana

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం

స‌భ ప్రారంభం రోజే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు స‌మాచారం అందించారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం
X

తెలంగాణ రాష్ట్ర శాసనసభ‌, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతాయి.

ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్ర శాసనమండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు తెలిపారు. ఒకే సమయంలో రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

స‌భ ప్రారంభం రోజే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు స‌మాచారం అందించారు.

ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ 2023,24 తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్‌ ఉండొచ్చని అధికారుల అంచనా.

Next Story