Telugu Global
Telangana

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీలకు ఆరో ఆటకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

ఈ నెల 12న బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి మూవీ, ఈ నెల 13న చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు ఉదయం 4 గంటల ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

X

త్వరలో విడుదల కానున్న టాలీవుడ్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ల మూవీలకు ఆరోఆట‌ ప్రదర్శన‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ నెల 12న బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి మూవీ, ఈ నెల 13న చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు ఉదయం 4 గంటల ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆ మూవీలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఆరో ఆటకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ రెండు మూవీలకు మొదటి రోజు మాత్రమే ఆరో ఆట ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Next Story