Telugu Global
Telangana

తెలంగాణ వరద నష్టం రూ. 1400 కోట్లు

తక్షణ సాయిం వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ వరద నష్టం రూ. 1400 కోట్లు
X

తెలంగాణలో వరద నష్టం అంచనాలు పూర్తయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం తెలంగాణలో గోదావరి వరదల వల్ల 1400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ఈ నివేదికను కేంద్రానికి పంపి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరింది. తక్షణ సాయిం వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

వరద నష్టం ఇలా..

రోడ్లు భవనాల శాఖ నష్టం రూ.498 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ నష్టం రూ.449 కోట్లు

ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ రూ.33 కోట్లు

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూ.379 కోట్లు

విద్యుత్ శాఖ నష్టం రూ.7 కోట్లు

పునరావాసం కోసం రూ.25 కోట్లు

ఇతర నష్టాలన్నీ కలిపితే మొత్తం రూ.1400 కోట్లు..

వరదల వల్ల కాజ్ వేలు, రోడ్లు కొట్టుకుపోయాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆ నివేదికలో పొందుపరిచారు. గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయని చెప్పారు. నిర్మల్, భైంసా, మంచిర్యాల, మంథని, రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. అయితే పంట నష్టం ఇంకా అంచనా వేయలేదు. వ్యవసాయ శాఖ నష్టాన్ని మరికొన్నిరోజుల అధ్యయనం తర్వాత ప్రకటించే అవకాశముంది. గోదావరి నది పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. మరి తెలంగాణ అభ్యర్థనను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా.. తక్షణ సాయం అందిస్తుందా అనేది వేచి చూడాలి.

First Published:  21 July 2022 3:18 AM GMT
Next Story