Telugu Global
Telangana

ఫలించిన కేటీఆర్ పోరాటం... కంటోన్మెంట్ ను GHMCలో విలీనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర‍ం

ఈ కమిటీ కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి, ఇతర‌ స్థిరాస్తులను, కంటోన్మెంట్ బోర్డ్ ఉద్యోగులు/పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, చరాస్తులు, దుకాణాలు, రహదారి నిర్వహణ, ట్రాఫిక్ తదితర రికార్డులు పరిశీలిస్తుంది.

ఫలించిన కేటీఆర్ పోరాటం... కంటోన్మెంట్ ను GHMCలో విలీనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర‍ం
X

సికిందరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని GHMC లో విలీనం చేయాలని చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరు సలుపుతున్నారు. ఇంత కాలానికి ఎట్టకేలకు ఆయన పోరాటం ఫలించింది. కంటోన్మెంట్ ను GHMC లో విలీనం చేయడానికి కావాల్సిన విధి విధానాలను నిర్ణయించడానికి కేంద్ర రక్షణ శాఖ (MoD) 8 మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది.

Advertisement

ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖ ప్రకారం MoD సంయుక్త కార్యదర్శి (ఫైనాన్స్) ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా MoD జాయింట్ సెక్రటరీ (లాండ్ అండ్ వర్క్స్), అదనపు డైరెక్టర్ర్జ జ‌నరల్ (కంటోన్మెంట్స్), డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్(DGD), అదనపు DG (ల్యాండ్ అండ్ వర్క్స్, ఎన్విరాన్ మెంట్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ కార్యదర్శి, కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో లు ఉంటారు.

Advertisement

ఈ కమిటీ కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి, ఇతర‌ స్థిరాస్తులను, కంటోన్మెంట్ బోర్డ్ ఉద్యోగులు/పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, చరాస్తులు, దుకాణాలు, రహదారి నిర్వహణ, ట్రాఫిక్ తదితర రికార్డులు పరిశీలిస్తుంది.

GHMCలో కంటోన్మెంట్ బోర్డు విలీనానికి సూత్రప్రాయ సమ్మతిని తెలియజేస్తూ 2022 డిసెంబర్ 14న తెలంగాణ ప్రభుత్వం రక్షణ శాఖకు లేఖ రాసింది.

ఎట్టకేలకు 4 లక్షల మంది ప్రజల కల ఇంత కాలానికి నిజమవుతున్నందుకు ఆనందంగా ఉందని కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనే సంస్థ కార్యదర్శి ఎస్ రవీందర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చేసిన కృషి పట్ల కంటోన్మెంట్ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story