Telugu Global
Telangana

ఆ ఫ్యాన్సీ నంబ‌ర్ ధ‌ర రూ.21.60 ల‌క్ష‌లు

ఫ్యాన్సీ నంబ‌ర్ల వేలం ఖైర‌తాబాద్ ఆర్టీఏ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించ‌గా, ఒక్క‌రోజే ఏకంగా రూ.56,34,894 ఆదాయం రావ‌డం విశేషం.

ఆ ఫ్యాన్సీ నంబ‌ర్ ధ‌ర రూ.21.60 ల‌క్ష‌లు
X

ఖైర‌తాబాద్ ఆర్టీఏ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ఫ్యాన్సీ నంబ‌ర్ల వేలంలో ఒక నంబ‌రు కోసం వాహ‌న‌దారుడు ఏకంగా రూ.21 ల‌క్ష‌ల 60 వేలు వెచ్చించాడు. ఇంత‌కీ ఆ నంబ‌ర్ ఏంటంటే.. 9999. సాధార‌ణంగా ఫ్యాన్సీ నంబ‌ర్ల‌కు మార్కెట్‌లో ఉండే క్రేజ్ చాలా ఎక్కువ‌. ఖ‌రీదైన కార్లు, బైకుల‌కు ఫ్యాన్సీ నంబ‌ర్ కోసం ఎంతైనా చెల్లించేందుకు వాహ‌న‌దారులు పోటీప‌డుతుంటారు. దీనిని ర‌వాణా శాఖ కూడా స‌ద్వినియోగం చేసుకుంటూ.. భారీ స్థాయిలో ఆదాయం స‌మకూర్చుకుంటోంది.

ఫ్యాన్సీ నంబ‌ర్ల వేలం ఖైర‌తాబాద్ ఆర్టీఏ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించ‌గా, ఒక్క‌రోజే ఏకంగా రూ.56,34,894 ఆదాయం రావ‌డం విశేషం. ఈ వేలంలో అత్య‌ధికంగా TS 09 GC 9999 నంబ‌రు రూ.21 ల‌క్ష‌ల 60 వేలు ప‌లికింది. దీనిని కొనుగోలు చేసింది.. ప్రైమ్ సోర్స్ గ్లోబ‌ల్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌. ఆ త‌ర్వాత మేఘా ఇంజ‌నీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సంస్థ రూ.10 ల‌క్ష‌ల 50 వేల‌కు TS 09 GD 0009 నంబ‌రును సొంతం చేసుకుంది. ఇక అత్య‌ల్పంగా ధ‌ర ప‌లికిన నంబ‌రు విలువ ఎంతో తెలుసా.. రూ.1,04,999. ఇంత ధ‌ర వెచ్చించి తీసుకున్న నంబ‌ర్ TS 09 GD 0027.

First Published:  8 Aug 2023 11:30 AM GMT
Next Story