Telugu Global
Telangana

కండువా తుస్.. చెప్పులు హిట్.. టీబీజేపీకి షాక్

మునుగోడు 'ఆత్మగౌరవ సభ'. కానీ ఆ పేరుకి ఏమాత్రం పొంతన లేకుండా అమిత్ షా కి చెప్పులందించిన బండి సంజయ్ ఆత్మగౌరవాన్ని ఆయన కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ విమర్శిస్తోంది.

కండువా తుస్.. చెప్పులు హిట్.. టీబీజేపీకి షాక్
X

పొడిచేస్తాడు, చించేస్తాడు, పంచ్ డైలాగులతో అదరగొడతాడు అనుకున్న అమిత్ షా మునుగోడులో తుస్సుమనిపించాడు. అసలే సభ ఫ్లాప్ అయిపోందని బాధపడుతున్న టీబీజేపీ శ్రేణులకు పుండుమీద కారంలా ఇప్పుడు చెప్పుల గొడవ మొదలైంది. అమిత్ షా మునుగోడుకి వచ్చి రాజగోపాల్ రెడ్డి మెడలో వేసిన కండువా కంటే, అమిత్ షా కి బండి సంజయ్ వినమ్రంగా ఇచ్చిన చెప్పులే హైలైట్ అయ్యాయి. అమిత్ షా.. సీఎం కేసీఆర్ పై పేల్చిన డైలాగులకంటే, ట్విట్టర్లో అమిత్ షా పై కేటీఆర్ పేల్చిన సెటైర్లే వైరల్ గా మారాయి. అందుకే టీ బీజేపీ దిగాలు పడింది. అటు వ్రతం చెడిందని, ఇటు ఫలితమూ దక్కలేదని ఆందోళనలో ఉంది.

పేరుకే ఆత్మగౌరవ సభ..

మునుగోడు 'ఆత్మగౌరవ సభ'. కానీ ఆ పేరుకి ఏమాత్రం పొంతన లేకుండా అమిత్ షా కి చెప్పులందించిన బండి సంజయ్ ఆత్మగౌరవాన్ని ఆయన కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం హైలైట్ కాకుండా చెప్పుల ఎపిసోడ్ హైలైట్ కావడంతో బీజేపీ నాయకులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. అమిత్ షా పాల్గొన్న ఆత్మగౌరవ సభ అని చెప్పుకోవ‌డానికి కూడా వెనకాడాల్సిన పరిస్థితి.

కేసీఆర్ ని రైతు వ్యతిరేకిగా చిత్రీకరించాలనుకున్న అమిత్ షా పన్నాగాలు కూడా ఏమాత్రం పారలేదు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో కేంద్రం విమర్శలపాలవుతోంది. కేసీఆర్ రైతుబంధుని ఆదర్శంగా తీసుకుని పీఎం కిసాన్ రూపొందించారన్న విమర్శలు కూడా బీజేపీకి తలనొప్పిగా మారాయి. మొత్తమ్మీద అమిత్ షా పర్యటనతో ఏమాత్రం లాభం లేకపోగా.. చెప్పుల ఎపిసోడ్ తో నష్టం జరిగిందని మధనపడుతున్నారు బీజేపీ శ్రేణులు. రాజగోపాల్ రెడ్డికి ఇది మరింత ఇబ్బందికర పరిణామంగా మారింది. ఆత్మగౌరవ సభ అని పేరుపెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి, ఇదేనా మీ ఆత్మగౌరవం అంటూ సోషల్ మీడియాలో పడుతున్న పంచ్ లకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. రాగా పోగా రామోజీతో భేటీ, జూనియర్ ఎన్టీఆర్ తో భోజనం.. వంటి కార్యక్రమాలతో ? ఏపీ బీజేపీ సంబరపడుతోంది. తెలంగాణ బీజేపీ మాత్రం సోషల్ మీడియాకి బాగా టార్గెట్ అయింది.

First Published:  22 Aug 2022 10:44 AM GMT
Next Story