Telugu Global
Telangana

గోదావరిలో చిక్కుకపోయినవారిని హెలికాప్టర్ ద్వారా రక్షించిన ప్రభుత్వం

తెల‍ంగాణలో నాలుగు రోజుల నుంచి నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయిపోయింది. వరదలు తీవ్రమయ్యి అనేక చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గోదావరిలో చిక్కుకపోయినవారిని హెలికాప్టర్ ద్వారా రక్షించిన ప్రభుత్వం
X

తెల‍ంగాణలో నాలుగు రోజుల నుంచి నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయిపోయింది. వరదలు తీవ్రమయ్యి అనేక చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి నది ఎన్నడు లేనంత గా ప్రవహిస్తోంది. గోదావరి తీర ప్రాంతంలోని గ్రామాల ప్ర‌జలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలమీద సహాయకచర్యలను చేపడుతోంది. అన్ని జిల్లాల కలెక్టర్లను మూడురోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్

అప్రమత్తం చేశారు. దాంతో ఎక్కడికక్కడ అధికారులు ప్రజలను , ఆస్తులను రక్షించడానికి అన్ని రకాల చర్యలుచేపడుతున్నారు.

ఇవ్వాళ్ళ ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం సోమన్‌పల్లె సమీపంలో గోదావరిలో చిక్కుకుపోయిన ఇద్దరిని ప్రభుత్వ హెలికాప్టర్ రక్షించింది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ నుంచి సమాచారం అందుకున్న తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు విపత్తు నివారణ బృందాలను అప్రమత్తం చేశారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో ఘటనాస్థలికి చేరుకున్నాయి. అయితే, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు స్థలం లేకపోవడంతో, రెస్క్యూ టీమ్‌లు హెలికాప్టర్ నుండి తాడును కిందికి జారవిడిచి, దాని సహాయంతో వారిద్దరిని హెలికాప్టర్‌లోకి లాగి రక్షించారు.

Next Story