Telugu Global
Telangana

దేశంలో ఉన్న సహజ సంపదను ప్రజల పరం చేయడమే బీఆరెస్ లక్ష్యం ‍-కేసీఆర్

''దేశంలో బీఆరెస్ కానీ , బీఆరెస్ సమర్దించే ప్రభుత్వంకానీ అధికారంలోకి వస్తే దేశాన్ని వెలుగు జిలుగులతో నింపుతాం. కరెంట్ 24 గంటలు ఇస్తాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. రైతు బంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. భారదేశమంతా దళిత బంధు అమలు చేస్తాము. 5 ఏళ్ళ లోపు దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికీ మంచినీళ్ళిస్తాం.'' అని కేసీఆర్ ప్రకటించారు.

దేశంలో ఉన్న సహజ సంపదను ప్రజల పరం చేయడమే బీఆరెస్ లక్ష్యం ‍-కేసీఆర్
X

భారత దేశంలో అన్ని దేశాలకన్నా ఎక్కువ సహజ సంపదలున్నాయని, వ్యవసాయ అనుకూల భూమి ఉందని, నీటి వనరులున్నాయని బీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. నదుల్లో పారుతున్న నీళ్ళన్నీ సముద్రాల పాలవుతుంటే 75 ఏళ్ళుగా ప్రభుత్వాలు చూస్తూ కూర్చున్నాయి తప్ప కనీసం పట్టించుకోలేదని, మనకన్నా చిన్న దేశాలైన జింబాబ్వే, ఘనా లాంటి దేశాలు కూడా పెద్ద పెద్ద నీటి ప్రాజెక్టులను కట్టుకున్నాయని కేసీఆర్ అన్నారు. దేశంలో ఉన్న నీటి వనరులన్నింటిని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేయడం, పకృతి ఇచ్చిన సహజ వనరులన్నింటినీ ప్రజల పరం చేయడమే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని, అందుకే బీఆరెస్ పుట్టిందని కేసీఆర్ అన్నారు.

ఖమ్మంలో జరిగిన బీఆరెస్ బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ , చాలా కాలంగా ఓ ప్రశ్న నా మనసును కలచివేస్తున్నది.రాజకీయాలు ఎప్పుడూ నడుస్తాయి కానీ ఈ రోజు భారత దేశం లక్ష్యం ఏంటి ? స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో న్నాయి. మన కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్న చైనా, అమెరికాలు అభివృద్ది పథంలో దూసుకపోతున్నాయి. మనదగ్గర చాలా వ్యవసాయ అనుకూల భూమి ఉన్నది. అద్భుతమైన వాతావరణం ఉంది. ఇటువంటి దేశంలో మెక్ డోనాల్డ్ పిజ్జాలు, బర్గర్లా మనం తినేది ? ప్రపంచానికి ఎగుమతి చేయగల్గిన పరిస్థితులుండాల్సిన ఇండియా, కెనడా నుంచి కందిపప్పు, అమెరికా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవడం ఎంత దారుణం? '' అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

''దేశంలో బీఆరెస్ కానీ , బీఆరెస్ సమర్దించే ప్రభుత్వంకానీ అధికారంలోకి వస్తే దేశాన్ని వెలుగు జిలుగులతో నింపుతాం. కరెంట్ 24 గంటలు ఇస్తాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. రైతు బంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. భారదేశమంతా దళిత బంధు అమలు చేస్తాము. 5 ఏళ్ళ లోపు దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికీ మంచినీళ్ళిస్తాం.చట్ట సభల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తున్నాం'' అని కేసీఆర్ ప్రకటించారు.

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనన్న కేసీఆర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజలకోసం చేసిందేమీ లేదన్నారు.

మోడీ పాలనపై కేసీఆర్ మండిపడ్డారు. నష్టమొస్తే ప్రజల మీద రుద్దాలి. లాభాలు కార్పోరేట్ లకు పంచాలి. ఇదీ మోడీ విధానం. అని కేసీఆర్ అన్నారు. ''మీ పాలసీ ప్రైవేటేజైషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఎల్ ఐసీ ని నువ్వు అమ్ముతే మేము మళ్ళీ కొంటాం. '' అని కేసీఆర్ స్పష్టం చేశారు.

వ్యవ‌సాయాన్ని కార్పోరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని, రైతులు తమ భూమిలో తామే కూలీలుగా మారేపరిస్థితి వస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. .

మత విద్వేషాలకు వ్యతిరేకంగా అందరం ఏకమయ్యి పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అందరం ఏకమైతే ఈ మూర్ఖుల పాలనను నాశనం చేయడం కష్టం కాదని కేసీఆర్ అన్నారు.

Next Story