Telugu Global
Telangana

కేంద్రానికి దక్షిణాది మూవీల పట్ల కూడా వివక్షే - తలసాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ సర్కార్ సినిమా రంగం అభివృద్దికి చేపడుతున్న చర్యల వల్ల ఇక్కడ సినీ పరిశ్రమ అద్భుతంగా డెవలప్ అయ్యిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంటుందని తలసాని తెలిపారు.

కేంద్రానికి దక్షిణాది మూవీల పట్ల కూడా వివక్షే - తలసాని
X

కేంద్ర బీజేపీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాల పట్లనే కాక ఇక్కడ నిర్మించే సినిమాల పట్ల కూడా వివక్ష చూపిస్తోందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వ‌జమెత్తారు.ఈ రోజు ఆయన మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆస్కార్ అవార్డు కోసం RRR మూవీని పంపించకుండా గుజరాత్ మూవీ 'చెలో షో' ను ఆస్కార్ ఎంట్రీకి పంపించిందని ఆరోపించారు. అయినా మోడి సర్కార్ కు గుణపాఠం చెప్తూ RRR మూవీ ఆస్కార్ అవార్డ్ సాధించిందని తలసాని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ సర్కార్ సినిమా రంగం అభివృద్దికి చేపడుతున్న చర్యల వల్ల ఇక్కడ సినీ పరిశ్రమ అద్భుతంగా డెవలప్ అయ్యిందన్నారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంటుందని తలసాని తెలిపారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన RRR మూవీ టీం ను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించాలని నిర్ణయించిందని తలసాని తెలిపారు. ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు సినిమాగా RRR చరిత్రలో నిలిచిపోతుందన్నారాయన. ఈ చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తో సహా చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు శ్రీనివాస యాదవ్.

First Published:  13 March 2023 10:01 AM GMT
Next Story