Telugu Global
Telangana

బీఆర్ఎస్‌ కౌన్సిలర్‌ను కిడ్నాప్‌ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!

సీపీఐ, కాంగ్రెస్‌ కౌన్సిలర్లను తీసుకెళ్తుంగా అడ్డుకోవడంతో.. రెచ్చిపోయిన హస్తం పార్టీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

బీఆర్ఎస్‌ కౌన్సిలర్‌ను కిడ్నాప్‌ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మ‌న్‌పై అవిశ్వాస ఓటింగ్‌కు ముందు హైడ్రామా నడిచింది. మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నేప‌థ్యంలో పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోతుంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్‌ నాగేశ్వరరావును కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా లాక్కెళ్లారు. కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీపీఐ కౌన్సిలర్‌ను ఆ పార్టీ నేతలు తమవెంట తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఆఫీసు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

సీపీఐ, కాంగ్రెస్‌ కౌన్సిలర్లను తీసుకెళ్తుంగా అడ్డుకోవడంతో.. రెచ్చిపోయిన హస్తం పార్టీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు ఓవరాక్షన్ చేశారని మాజీఎమ్మెల్యే హరిప్రియ మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 144 సెక్షన్ వర్తించదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తీరుకు నిరసనగా హరిప్రియ మున్సిపాలిటీ ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. ఎత్తుకెళ్లిన ఇద్దరు కౌన్సిలర్లను తిరిగి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కౌన్సిలర్లకు భద్రత కల్పించకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

First Published:  5 Feb 2024 11:34 AM GMT
Next Story