Telugu Global
Telangana

మునుగోడులో ఉద్రిక్తం... టీఆరెస్ శ్రేణులపై బీజేపీ కార్యకర్తల దాడి

మునుగోడు మండలం పలివెలలో బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ సమక్షంలో టీఆరెస్ కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారు. మునుగోడు మండలం పలివెలలో ఈ దాడి జరిగింది.

మునుగోడులో ఉద్రిక్తం... టీఆరెస్ శ్రేణులపై బీజేపీ కార్యకర్తల దాడి
X

మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటమి భయ‍ం పట్టుకుందా ? ఎందుకు బీజేపీ కార్యకర్తలు, హింసకు, దాడులకు తెగబడుతున్నారు? నిన్న రాత్రి చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి , ఆరెగూడెం, అంకిరెడ్డి గూడెంలలో ప్రజలపై, టీఆరెస్ కార్యకర్తలపై దాడుల తెగబడ్డ బీజేపీ కార్యకర్తలు ఇవ్వాళ్ళ మునుగోడు మండలం పలివెలలో దాడి చేశారు.

ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా ఈ దాడి జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి

కేటీఆర్ రోడ్ షో కి వెళ్తున్న టీఆర్ఎస్ శ్రేణులపైన కోమటి రెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేశారు. బైటి నుంచి వచ్చిన వందల మంది బీజేపీ కార్యకర్తలతో ఈటల రాజేందర్ కాన్వాయ్ పలివెలకు చేరుకోగానే అక్కడ కేటీఆర్ రోడ్ షోకు వెళ్ళడానికి సిద్దమవుతున్న టీఆరెస్ శ్రేణులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది అది మరింత తీవ్రమై ఘర్షణకు దారి తిసింది. కర్రలు, రాళ్ళతో బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రేజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్ తో సహా పలువురు టీఆరెస్ కార్యకర్తల‌కు గాయాలయ్యాయి. టీఆరెస్ శ్రేణులు చేసిన ఎదురుదాడిలో ఈటల కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

అయితే దాడి ముందు టీఆరెస్ వర్గాలే చేశాయని ఈటల రాజేందర్ ఆరోపించగా బీజేపీ నాయకులే తమ కార్యకర్తలతో కలిసి తమపై దాడికి తెగబడ్డారని టీఆరెస్ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ సుదర్శన్ రెడ్డి మండి పడ్డారు.

ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్ తో బీజేపీ దాడులకు తెగబడుతోందని నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్ ఆరోపించారు.

First Published:  1 Nov 2022 10:33 AM GMT
Next Story