Telugu Global
Telangana

ఆర్జీవీ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత.. వ్యూహం సినిమా పోస్టర్ల ద‌గ్ధం

టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచే విధంగా దర్శకుడు వర్మ ఈ చిత్రాన్ని తీస్తున్నారని ఆ పార్టీ కొద్దిరోజులుగా ఆరోపిస్తోంది. ఈ సినిమాను అడ్డుకోవాలని నారా లోకేష్ కోర్టును కూడా ఆశ్రయించారు.

ఆర్జీవీ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత.. వ్యూహం సినిమా పోస్టర్ల ద‌గ్ధం
X

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయం ఎదుట కొంతమంది వ్యక్తులు సోమవారం ఆందోళనకు దిగారు. దీంతో వర్మ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తీశాడు. 2009 నుంచి 2014 వరకు జగన్ పొలిటికల్ కెరీర్ లో జరిగిన ఘటనలను వర్మ ఇందులో చూపించబోతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచే విధంగా దర్శకుడు వర్మ ఈ చిత్రాన్ని తీస్తున్నారని ఆ పార్టీ కొద్దిరోజులుగా ఆరోపిస్తోంది. ఈ సినిమాను అడ్డుకోవాలని నారా లోకేష్ కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ఈ సినిమా పలుమార్లు విడుదల వాయిదా పడింది. అన్ని వివాదాలు దాటుకొని వ్యూహం సినిమా ఈనెల 29వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించారు.

ఇదిలా ఉంటే.. ఇవాళ హైదరాబాద్ లో వర్మ కార్యాలయం వద్ద వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ కొంతమంది వ్యక్తులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు వ్యూహం సినిమా పోస్టర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టారు.

First Published:  25 Dec 2023 4:02 PM GMT
Next Story