Telugu Global
Telangana

రేపటి నుంచి సినిమా షూటింగ్ లు బంద్

పెరుగుతున్న ప్రొడక్షన్ ఖర్చులు, హీరోల రెమ్యూనరేషన్ లు, ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం తదితర కారణాల వల్ల తెలుగు చిత్ర రంగం నష్టాల్లో కూరుకపోయిందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఈ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రేపటి నుంచి షూటింగులు ఆపేయాలని నిర్ణయించారు.

రేపటి నుంచి సినిమా షూటింగ్ లు బంద్
X

ఆగస్టు 1వ తేదీ నుంచి తెలుగు మూవీ షూటింగులు ఆపేయాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన ఫిలిం చాంబర్ జనరల్ బాడీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

''ఇప్పటికే చాలా సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి. వాటిని కూడా ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాం. సమస్యలన్నీ పరిష్కారం అయ్యేందుకే ఈనిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో వెల్లడిస్తాము.'' అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

కరోనా కారణంగా తెలుగు చిత్ర రంగం నష్టాల్లో కూరుకపోయింది. థియేట్రికల్ వసూళ్లు బాగా పడిపోయాయి. మరో వైపు ప్రొడక్షన్ ఖర్చులు అనేక రెట్లు పెరిగిపోయాయి " అని నిర్మాతల వాదన‌

తెలుగు సినిమాల షూటింగులు ఆపేయాలంటూ దాదపూ 15 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చి షూటింగుల‌ను ఆపివేసారు. నిర్మాతలు నష్టాన్ని నివారించడానికి, మూవీ థియేటర్లలో విడుదలైన 10 వారాల తర్వాత మాత్రమే OTT ప్లాట్‌ఫారమ్‌లపై విడుదల చేయాలని నిర్మాతలు సంయుక్తంగా నిర్ణయించుకున్నారు.

అలాగే, స్టార్ హీరోల రెమ్యూనరేషన్..ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ విపరీతంగా పెరిగిపోవడం, దీంతో సినిమా బడ్జెట్ నిర్మాతల కంట్రోల్ లో లేకుండా పోయింది. ఇవన్నీ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని దిల్ రాజు చెప్పారు.

అధిక టిక్కెట్ ధరల కారణంగా, కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకులు మునుపటిలా సినిమాలు చూడటానికి థియేటర్‌లకు రావడం లేదు. అలాగే టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. సాధారణ థియేటర్లలో టికెట్ ధరలను రూ.100 నుంచి రూ.70కి తగ్గించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.150 నుంచి రూ.120 ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

First Published:  31 July 2022 10:06 AM GMT
Next Story