Telugu Global
Telangana

టీఆరెస్,కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం చేయండి... బీజేపీ నేతలతో అమిత్ షా

టీఆరెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని, రెండు పార్టీలు ఒకటే అని ప్రచారం చేయండి అని బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక బీజేపీ నాయకుల మధ్య ఐక్యత కొరవయ్యిందని ఆయన మండిపడ్డారు.

టీఆరెస్,కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం చేయండి... బీజేపీ నేతలతో అమిత్ షా
X

తెలంగాణ విమోచన దినం కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమం తర్వాత బీజేపీ నేతలతో సమావేశ‌మయ్యారు. తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా ప్రధానంగా మునుగోడు ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడారు.

తనకొచ్చిన రిపోర్టుల ప్రకారం మునుగోడులో మనకు మంచి అవకాశాలున్నాయని, అయితే నాయకులే సరిగా పని చేయడం లేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మునుగోడులో మరింత దూకుడుగా వెళ్ళాల్సిన అవసరం ఉందని నేతలకు దిశానిర్దేశం చేశారాయన‌. అలాగే వచ్చే ఎన్నిలల్లో కాంగ్రెస్, టీఆరెస్ కలిసి పోటీ చేస్తాయని , లేదంటే ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటాయని చెప్పిన అమిత్ షా ఈ విష‌యాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. టీఆరెస్, కాంగ్రెస్ ఒకటే అన్న భావన ప్రజల్లో కల్పించాలని, అందుకోసం ప్రచారం ముమ్మరం చేయాలని అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది.

గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక నాయకత్వంపై అమిత్ షా ఫైర్ అయినట్టు సమాచారం. పార్టీ నేతల మధ్య ఐక్యత కొరవయ్యిందని, అధిష్టానం అంచనాలకు తగ్గట్టు పని చేయడంలేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీ పట్ల ప్రజలకు ఆసక్తి ఉందని అయితే స్థానిక నాయకుల పనితీరే బాగాలేదని ఆయన అన్నారు.

''మునుగోడు ఎన్నికలపై ఫోకస్ పెంచండి, కాంగ్రెస్ పని అయిపోయిందని, టీఆరెస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రచారం చేయండి'' అని అమిత్ షా దిశానిర్దేశం చేశారు.

First Published:  17 Sep 2022 9:25 AM GMT
Next Story