Telugu Global
Telangana

26 నుంచి దసరా సెలవులు

ఈ నెల 26 తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నెల25న, అక్టోబర్ 9వ తేదీన ఆదివారాలు కావడంతో విద్యా సంస్థలకు మొత్తం వరసగా 15 రోజులు సెలవులు రానున్నాయి.

26 నుంచి దసరా సెలవులు
X

తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుకునే దసరా పండుగకోసం ప్రభుత్వం విద్యార్థులకు ప్రతి సంవత్సరంలాగే సెలవులు ప్రకటించింది. ఈ సారి సెలవులు తగ్గుతాయనే ప్రచారం నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ 13 రోజుల పాటు సెలవులిచ్చింది ప్రభుత్వం. ఈ నెల 26 వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు సెలవులిస్తూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్‌ పంపించింది ప్రభుత్వం. వచ్చే నెల 5న దసరా పండుగ. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకుంటాయి.

First Published:  13 Sep 2022 7:44 AM GMT
Next Story