Telugu Global
Telangana

క్విజ్‌ ఫలితాలే ఇవ్వలే.. జాబులిస్తామంటే ఎలా నమ్ముతం..?

పరీక్షలు పూర్తయి 6నెలలు గడుస్తోంది. అయినా ఫలితాల ఊసే లేదు. బహుమతులకు దిక్కేలేదు. దీంతో పరీక్ష రాసినవారు ఫలితాలేవి..? బహుమతులేవి..? అని స్థానిక నేతలను ప్రశ్నిస్తున్నారు.

క్విజ్‌ ఫలితాలే ఇవ్వలే.. జాబులిస్తామంటే ఎలా నమ్ముతం..?
X

యూత్‌ డిక్లరేషన్‌, ఉద్యోగ క్యాలెండర్‌ పేరుతో హడావుడి చేస్తున్న కాంగ్రెస్‌పై మండిపడుతోంది తెలంగాణ యువ‌త‌. 6 నెలల కిందట కాంగ్రెస్‌ పెట్టిన క్విజ్‌ పోటీలే ఇందుకు కారణం. యువతను ఆకట్టుకునేందుకు జూన్‌ 18న రాజీవ్‌గాంధీ యూత్‌ క్విజ్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా క్విజ్‌ పోటీలు నిర్వహించింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

క్విజ్‌ పోటీల కోసం ప్రతి నియోజకవర్గం నుంచి విద్యార్థులు, యువతను ఎన్‌రోల్‌ చేయించింది. గెలిచిన వారికి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు ఇస్తామని ప్రకటించారు. మహిళా టాపర్లకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఇస్తామని బిల్డప్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందితో ఈ పోటీ పరీక్షలు రాయించారు.

పరీక్షలు పూర్తయి 6నెలలు గడుస్తోంది. అయినా ఫలితాల ఊసే లేదు. బహుమతులకు దిక్కేలేదు. దీంతో పరీక్ష రాసినవారు ఫలితాలేవి..? బహుమతులేవి..? అని స్థానిక నేతలను ప్రశ్నిస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో రాహుల్‌గాంధీనే ప్రశ్నిస్తున్నారు. ఫలితాలు ఎప్పుడొస్తాయి..? ప్రైజ్‌లు ఎప్పుడిస్తారు..?’ అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. క్విజ్‌ ఫలితాలు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. క్విజ్‌ ఫలితాలే ఇవ్వలేని కాంగ్రెస్‌.. జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేసి జాబులిస్తామంటే ఎలా నమ్ముతాం..? అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  27 Nov 2023 5:31 AM GMT
Next Story