Telugu Global
Telangana

దేశంలోనే తొలిసారి తెలంగాణలో 'నేతన్నకు బీమా పథకం' - ఆగస్టు 7 నుంచి ప్రారంభం

చేనేత కార్మికుల కు బీమా సౌకర్యం కల్పిస్తూ తెలం గాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ళ లోపు ఉన్న చేనేత కార్మికులందరికి ఈ పథకం వర్తిస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి బీమ కవరేజీని అందించనున్నారు.

దేశంలోనే తొలిసారి తెలంగాణలో నేతన్నకు బీమా పథకం - ఆగస్టు 7 నుంచి ప్రారంభం
X

దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలి సారి చేనేత కార్మిలకు బీమా పథకం తీసుకవచ్చింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 నుంచి 'నేతన్నకు బీమా పథకం' కింద చేనేత , పవర్‌లూమ్ నేత కార్మికులకు బీమా కవరేజీని అందించనున్నారు.

దేశంలోనే నేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చేనేత జౌళి శాఖ మంత్రి కెటి రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రైతు బీమా పథకంతో సమానంగా నేతన్నకు బీమా పథకం కింద 60 ఏళ్లలోపు ఉన్న నేత కార్మికులకు బీమా కవరేజీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పథకం కింద ఎవరైనా నేత కార్మికుడు అనారోగ్యంతో, ఏదైనా అవాంఛనీయ సంఘటనతో మరణిస్తే, రూ. 5 లక్షల బీమా అందించబడుతుందని కేటీఆర్ తెలిపారు.

"నేత కార్మికులకు బీమా కవరేజీ ఇవ్వడం వారి కుటుంబాలకు గొప్ప‌ ఆర్థిక ఆసరాను కలిగిస్తుంది" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


బీమా కవరేజీ పథకం అమలుతో రాష్ట్రంలో దాదాపు 80,000 మంది చేనేత, పవర్‌లూమ్, అనుబంధ నేత కార్మికులు ప్రయోజనం పొందుతారు. 18 నుండి 59 సంవత్సరాల వయస్సు గల నేత కార్మికులకు బీమా కవరేజీని వర్తింపజేస్తారు.

పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

2016-17 నుంచి తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి ఏటా రూ.1200 కోట్ల ప్రత్యేక బడ్జెట్ (బీసీ సంక్షేమం ద్వారా) మంజూరు చేస్తోంది. బడ్జెట్‌లో చేనేత రంగానికి అందించే సాధారణ ఆర్థిక సహాయానికి ఇది అదనం అని ఆయన చెప్పారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.55.12 కోట్లు కేటాయించింది. దీనికి అదనంగా రూ. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్‌ కింద 400 కోట్లు మంజూరు చేశామన్నారు.

అంతే కాక ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు చేనేత మిత్ర, నేతన్నకు చేయూత (పొదుపు నిధి పథకం), రుణమాఫీ పథకం, పరిశోధన, అభివృద్ధి, బ్రాండ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు, బతుకమ్మ చీరల ఆర్డర్లు, నేత కార్మికుల పొదుపు నిధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మగ్గాల సేవా కేంద్రాలు, మార్కెట్ ప్రోత్సాహకాలు, సిరిసిల్ల టెక్స్‌టైల్స్ పార్క్, మినీ టెక్స్‌టైల్స్ పార్క్, వరంగల్, సిరిసిల్ల ల‌లో అపెరల్ పార్క్, గద్వాల్‌లోని హ్యాండ్‌లూమ్స్ పార్క్‌ల ఏర్పాటుతో పాటు విద్యుత్ వినియోగంపై సబ్సిడీని చేనేత వర్గాలకు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.




First Published:  1 Aug 2022 10:00 AM GMT
Next Story