Telugu Global
Telangana

టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల.. 3 రోజులు ఆన్ లైన్ లో దరఖాస్తులు

ఈ నెల 15 నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు మొదలవుతాయి. ముందుగా స్కూల్ అసిస్టెంట్ లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చి ఆ తర్వాత వారి బదిలీలు చేపడతారు. 23, 24 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ ల బదిలీలు చేపడతారు.

టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల.. 3 రోజులు ఆన్ లైన్ లో దరఖాస్తులు
X

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 2 నుంచి బదిలీల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 3 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరిస్తారు. 5వ తేదీ వరకు, అంటే మూడు రోజులపాటు ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకుంటారు. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయిస్తారు.

పూర్తి షెడ్యూల్

ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ

6, 7 తేదీల్లో దరఖాస్తు కాపీలు డీఈవో కార్యాలయాల్లో సమర్పణ

8, 9 తేదీల్లో డీఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్ల ప్రదర్శన

10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ

12,13న సీనియారిటీ జాబితాల ప్రచురణ

14న ఎడిట్‌ చేసుకునే ఆప్షన్‌

ఈ నెల 15నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు మొదలవుతాయి. ముందుగా స్కూల్ అసిస్టెంట్ లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చి ఆ తర్వాత వారి బదిలీలు చేపడతారు. 23,24 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ ల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత ఎస్జీటీలకు పదోన్నతులిస్తారు. పదోన్నతుల తర్వాత ఎస్జీటీల బదిలీలు మొదలవతాయి.

సెప్టెంబర్‌ 1 కటాఫ్‌ డేట్‌ గా ప్రకటించారు. ఉపాధ్యాయులకు ఐదేళ్ల సర్వీసు ఒకేచోట పూర్తయితే, ప్రధానోపాధ్యాయులకు 8 ఏళ్ల సర్వీసు పూర్తయితే బదిలీ తప్పనిసరి. రిటైర్మెంట్‌కు మూడు సంవత్సరాలలోపు సర్వీసున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంది.


First Published:  1 Sep 2023 12:08 PM GMT
Next Story