Telugu Global
Telangana

జీఎస్డీపీ వృద్ధిలో గుజరాత్ ని మించిన తెలంగాణ..

త్వరలో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ గురించి గొప్పలు చెప్పుకునేందుకు సిద్ధమైన బీజేపీ, జీఎస్డీపీ గణాంకాలతో కథనాలు వండి వారుస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. గుజరాత్ వృద్ధి బాగానే ఉన్నా, అంతకంటే ఎక్కువ వృద్ధి తెలంగాణ సాధించింది.

జీఎస్డీపీ వృద్ధిలో గుజరాత్ ని మించిన తెలంగాణ..
X

రాష్ట్రాల ఆర్థిక స్థితి, వృద్ధి సామర్థ్యాన్ని తెలిపే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GSDP) లో తెలంగాణ గత ఐదేళ్లలో గణనీయమైన వృద్ధి సాధించింది. GSDP వృద్ధిలో దేశంలోనే మూడో స్థానాన్ని నమోదు చేసుకుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ లు కొలువైన గుజరాత్ సహా ఇతర అనేక రాష్ట్రాలను తెలంగాణ వెనక్కు నెట్టడం విశేషం.

త్వరలో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ గురించి గొప్పలు చెప్పుకునేందుకు సిద్ధమైన బీజేపీ జీఎస్డీపీ గణాంకాలతో కథనాలు వండి వారుస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. గుజరాత్ వృద్ధి బాగానే ఉన్నా, అంతకంటే ఎక్కువ వృద్ధి తెలంగాణ సాధించింది. విశాల సముద్రతీరం, ప్రతిష్టాత్మక పోర్ట్ లు, ఆధునీకరించిన విమానాశ్రయాలు, రహదారులు అన్నీ ఉన్నా కూడా గుజరాత్ జీఎస్డీపీ వృద్ధి కేవలం 10 లక్షల కోట్ల రూపాయలు కాగా, తెలంగాణ 11.2 లక్షల కోట్ల జీఎస్డీపీ వృద్ధి నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్, కర్నాటక తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు 11.2 లక్షల కోట్ల జీఎస్డీపీతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచాయి.

గుజరాత్ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రం గురించి ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. తీగల వంతెన దుర్ఘటనను సైతం మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తోంది. అందుకే ఇలా గుజరాత్ వృద్ధి అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టింది. కానీ గుజరాత్ లాంటి డబుల్ ఇంజిన్‌ సర్కార్ ల కంటే.. తెలంగాణ వంటి రాష్ట్రాలే అత్యధిక వృద్ధి నమోదు చేయడం గమనార్హం.

Next Story